Hypertension : అధిక రక్తపోటును అదుపులో ఉంచాలంటే?

ట్రాఫిక్‌లో ఎక్కువగా తిరిగే వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మార్కెట్‌ ఫీల్డ్‌, మెడికల్‌ రిప్రజెంటేటివ్స్, సేల్స్‌మెన్‌, డైవర్సు ఇలా తదితర వర్గాల్లో హైవర్‌టెన్షన్‌కు గురవుతున్నఘటనల

Hypertension : అధిక రక్తపోటును అదుపులో ఉంచాలంటే?

Hypertension

Hypertension : ఇటీవలికాలంలో అధిక రక్తపోటు బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అధికరక్తపోటుకు లోనవుతున్నారు. తలనొప్పి, జ్వరం, దగ్గు శరీరపు నొప్పులతో వచ్చే వారికి పరీక్షలు చేస్తే హైపర్‌ టెన్షన్‌ ఉన్నట్లు బయటపడుతుంది. అప్పటి వరకు వారికి తమకు అధిక రక్తపోటుతో బాధపడుతున్నామన్న విషయమే తెలియటంలేదు. నూటికి 80 శాతం మంది తాము అధిక రక్తపోటుతో బాధపడుతున్నామన్న విషయమే తెలియడం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం, పక్షవాతం మరియు కిడ్నీ ఫెయిల్యూర్, థైరాయిడ్, ఆర్థో సమస్యలు ఉన్నవారు హైపర్‌టెన్షన్‌తో ఎక్కువగా బాధపడుతున్నట్లు పరిశోధనల్లో తేలింది.

హైపర్ టెన్షన్ కు అనేక కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి తాను తీసుకునే ఆహారంపై ఏమాత్రం శ్రద్ధ పెట్టలేకపోతున్నాడు. భోజనం చేయాలనే ఆలోచనే ఉండడం లేదు. ఎక్కడ పడితే ఆక్కడ, ఏదీ పడితే అది తినేస్తున్నారు. తీసుకునే ఆహారంలో ఉప్పు ఉన్న ఆహార పదార్ధాలే ఎక్కువ ఉంటున్నాయి. ప్రానెస్‌ ఫుడ్‌, పీజ్జాలు, బర్గర్‌లు, రెడీమేడ్‌ మాంసం, కూల్‌డ్రింక్‌లు, ప్రిజ్‌లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిలో 20 శాతం ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఆల్కాహాల్‌ 1.2 ఎంఎల్‌కు మించితే బీపీ పెరిగే అవకాశాలూ ఉన్నాయి. దాదాపు 15 శాతం ట్రాఫిక్‌ టెన్షన్‌తో జనం హైవర్‌టెన్షన్‌కు గురువుతున్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు.

ట్రాఫిక్‌లో ఎక్కువగా తిరిగే వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మార్కెట్‌ ఫీల్డ్‌, మెడికల్‌ రిప్రజెంటేటివ్స్, సేల్స్‌మెన్‌, డైవర్సు ఇలా తదితర వర్గాల్లో హైవర్‌టెన్షన్‌కు గురవుతున్నఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అధిక ర‌క్త‌పోటును నియంత్రించ‌క‌పోతే అది గుండె, ఊపిరితిత్తులు, మెద‌డు, కిడ్నీల వంటి కీల‌క శరీర అవ‌యవాల‌పై ప్ర‌భావం చూపుతుంది. జీన్స్‌, ప‌లు సంద‌ర్భాల్లో ఒత్తిడికి లోన‌వ‌డం వంటివి మ‌న చేతుల్లో లేన‌ప్ప‌టికీ ఆహారం ద్వారా ర‌క్త‌పోటును అదుపులో ఉంచుకునేందుకు ప్ర‌య‌త్నించాలి. కూర‌గాయ‌లు, పండ్లు, న‌ట్స్‌, తృణ‌ధాన్యాలు, ప్రొటీన్, చేప‌ల‌ ద్వారా ర‌క్త‌పోటుకు క‌ళ్లెం వేయ‌వ‌చ్చ‌ని అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ సూచిస్తోంది.

బిపి అతి తీవ్ర స్థాయికీ పెరిగినప్పుడు వివరీతమైన తలనొప్పి నిద్రలేమి, చూపు మసకభారతం, విపరీతమైన అలనట, చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం, శ్వానతీనుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, తికమక పడటం లక్షణాలు కనిపిస్తాయి. గుండెకు రక్తం అందించే ధమనులు కుచించుకుపోతాయి. మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం రావచ్చు. కళ్లు దెబ్బతింటాయి. మూత్రపిండాలు, గుండె పనితీరు మందగించి ప్రాణాలకు ముప్పు రావచ్చు. ఉప్పులో ఉండే సోడియం ర‌క్తంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్‌పై ప్ర‌భావం చూపుతుంది. ట్రాన్స్ ఫ్యాట్స్‌, రెడ్ మీట్‌, ప్రాసెస్డ్‌, రిఫైన్డ్ కార్బొహైడ్రేట్లు, చ‌క్కెర పానీయాల‌కు దూరంగా ఉండాల‌ని రిక‌మెండ్ చేస్తోంది. ఇక రోజుకు 2300 ఎంజీ కంటే త‌క్కువ‌గా సోడియం తీసుకోవాలి. ఉప్పు అధికంగా ఉండే ఆహార‌ప‌దార్ధాల‌ను తీసుకోరాద‌ని స్ప‌ష్టం చేసింది. బీపీ అదుపులో ఉండాలంటే బ్రెడ్స్‌, రోల్స్‌, పిజ్జా, శాండ్‌విచ్ వంటి ఆహార ప‌దార్ధాల‌ను తీసుకోవ‌డం పూర్తిగా మానేయాలి.