Coconut : పవిత్రంగా భావించే కొబ్బరితో ప్రయోజనాలు ఎన్నంటే?

రోజు వారి పనిలో ఒత్తిడి, టెన్షన్ వంటివి పోవాలంటే రోజు కొద్ది మోతాదులో కొబ్బరి పాలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలలో పోషకాలను పెంపొందించటంలో కొబ్బరి బాగా ఉపకరిస్తుంది.

Coconut : పవిత్రంగా భావించే కొబ్బరితో ప్రయోజనాలు ఎన్నంటే?

Coconut

Coconut : కొబ్బరి కాయను అంతా పవిత్రంగా భావిస్తారు. మంచి పనులు చేయటానికి కొబ్బరికాయను కొట్టటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. కొబ్బరి నీటిని తాగటానికి వినియోగిస్తే కొబ్బరిని ఆహారాల్లో వినియోగస్తారు. కొబ్బరి నుండి తీసే నూనె సైతం వివిధ రకాలు ఉపయోగపడుతుంది. కొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే కొబ్బరి ఆరోగ్య ప్రదాయని. కొబ్బరి నూనెలో వైరల్, ఫంగల్ , బ్యాక్టీరియా వ్యాధికారికతను తగ్గించటంలో తోడ్పడుతుంది. కొబ్బరిలోని ప్రతిభాగం ఉపయోగపడుతుంది.

కొబ్బరి నీళ్లలో కార్బోహైడ్రేట్లు తక్కువ మోతాదులో ఉంటాయి. కొవ్వు సైతం తక్కువే. పొటాషియం అధికంగా ఉండగా చక్కెర తక్కువగా ఉంటుంది. జీర్ణ సమస్యలతో బాధపడే పిల్లలకు కొబ్బరి నూనె బాగా ఉపకరిస్తుంది. అతిసారం వచ్చిన సందర్భంలో రీ హైడ్రేషన్ గా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే పోటాషియం గుండె సమస్యలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. యూరినరీ ట్రాక్స్ ఇన్ఫెక్షన్లు , కిడ్నీ స్టోన్స్ తగ్గించటానికి ఔషదంగా పనిచేస్తుంది.

రోజు వారి పనిలో ఒత్తిడి, టెన్షన్ వంటివి పోవాలంటే రోజు కొద్ది మోతాదులో కొబ్బరి పాలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలలో పోషకాలను పెంపొందించటంలో కొబ్బరి బాగా ఉపకరిస్తుంది. కొబ్బరి, కాస్త బెల్లంతో కలిపి తీసుకోవటం వల్ల ఐరన్ పెరగటంతోపాటు వారికి మంచి శక్తి లభిస్తుందని నిపుణలు చెబుతున్నారు. అంతేకాకుండా ఎముకల పటుత్వం పెరుగి , కీళ్ళ సంబంధిత నొప్పులు తగ్గుతాయి. కడుపులో మంట, అజీర్ణం, త్రేన్పులు రావడం ఇలాంటి సమస్యలున్నవారంతా లేత కొబ్బరిని తినడం వల్ల వాటిని దూరం చేసుకోవచ్చు.

లేత కొబ్బరిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్‌లో లేత కొబ్బరిని చేర్చుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మగవారిలో స్పెర్మ్ కౌంట్‌ని వృద్ధి చేయటంలో పచ్చికొబ్బరి దోహదపడుతుంది. లైంగిక సమస్యలతో బాధపడేవారికి బాగా ఉపకరిస్తుంది. కొబ్బరిలో విటమిన్ ఎ,బి,సి, థయామిన్, రైబోప్లెవిన్, నియాసిన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఇనుము పుష్కలంగా దొరుకుతాయి. కొబ్బరిని ఆహారంలో తీసుకునే వారికి మలబద్ధకం, థైరాయిడ్ వంటి సమస్యలు తొలగిపోతాయి. వ్యాధి నిరోధక శక్తి పెంపొందాలంటే కొబ్బరి రోజువారి ఆహారంలో బాగం చేసుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుంది.