Zinc : శరీరానికి జింక్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నంటే!..

జింక్ కోసం చాలా మంది టాబ్లెట్లు వాడుతుంటారు. ఇలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్టులు రావచ్చు. వాటికి బదులుగా జింక్ కలిగి ఉన్న ఆహారం తీసుకోవటం మంచింది. జింక్ లోపం ఉన్న వాళ్ళల్లో ఎదుగుద

Zinc : శరీరానికి జింక్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నంటే!..

Zinc

Zinc : శరీరానికి అవసరమైన పోషకాలను అందించటంలో జింక్ ఎంతో సహాయకారిగా పనిచేస్తుంది. శరీరానికి కావాల్సిన ఇదో ముఖ్యమైన  ఖనిజం. మానవ శరీర ఎదుగుదలకు, నిర్వాహణకు అంటు వ్యాదుల నుండి తట్టుకోవటానికి జింక్ అవసరత ఎంతైనా ఉంది. శరీరంలోని వివిధ ఎంజైములు, హార్మోన్లలో బాగంగా ఉంటుంది. సూక్ష్మ పోషకాల జాబితాలో జింక్ కూడా ఒకటి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ ఇది కొద్ది మోతాదులో శరీరానికి అవసరమౌతుంది.

జింక్ ఉండే ఆహారాలను తీసుకోవటం ద్వారా శరీరానికి అవసరమైన జింక్ ను రోజు వారిగా పొందవచ్చు. రోగనిరోధక శక్తిని గణనీయంగా పెరిగేలా చేస్తుంది. బాక్టీరియా, వైరస్ ఇన్ ఫెక్షన్ల నుండి సురక్షితంగా కాపాడుతుంది. పురుషులకు జింక్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీని వల్ల సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి.

జింక్ కోసం చాలా మంది టాబ్లెట్లు వాడుతుంటారు. ఇలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్టులు రావచ్చు. వాటికి బదులుగా జింక్ కలిగి ఉన్న ఆహారం తీసుకోవటం మంచింది. జింక్ లోపం ఉన్న వాళ్ళల్లో ఎదుగుదల ఆగిపోతుంది. జుట్టురాలటం, చర్మం దెబ్బతినటం వంటివి చోటుచేసుకుంటాయి. రోజుకు పురుషులకు 11 మిల్లీ గ్రాములు, ఆడవారికి 8మిల్లీ గ్రాముల జింక్ అవసరమవుతుంది.

శనగలు, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, జనపనార గింజలు, బీన్స్, బ్లాక్ బీన్స్, ఓట్స్, జీడిపప్పు, పెరుగు, డార్క్ చాక్ లెట్, పుట్టగొడుగులు, అవకాడో, రొయ్యలు, పాలకూర, చేపలు వంటి వాటిల్లో జింక్ పుష్కలంగా లభిస్తుంది. ఇలాంటి ఆహారాన్ని తీసుకోవటం ద్వారా మన శరీరానికి తగినంత జింక్ అందుతుంది. జింక్ పుష్కలంగా లభించే ఆహారాన్ని తినటం మూలంగా చర్మం, పాంక్రియాస్, లివర్, కిడ్నీలకు మేలు కలుగుతుంది.

మొటిమల సమస్యతో బాధపడుతున్నవారు జింక్ ఉండే ఆహారం తీసుకుంటే సమస్యనుండి విముక్తి లభిస్తుంది. కాలిన గాయాలు, పుండ్లన త్వరగా మానేలా చేయటంలో జింక్ ఎంతో దోహదపడుతుంది. పుండ్లు మాన్పేందుకు తయారుచేసే అనేక అయింట్ మెంట్లు, మందుల్లో జింక్ ను ఉపయోగిస్తారు. జింక్ ను శరీరానికి కావాల్సిన మోతాదులో మాత్రమే అందించాలి. గర్భినీ స్త్రీలు రోజుకు 40ఎంజి కంటే ఎక్కవ జింక్ తీసుకోకూడదు. శరీరానికి జింక్ కావాల్సిన పరిమాణం గురించి వైద్యుని సంప్రదిస్తే మంచిది.