kitchen : అన్నపూర్ణాదేవి నియలమైన వంటింట్లో ఇవి ఉంటే దరిద్రం..
ఇంట్లో ఒక్కో గదికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తర దిశకు అధిపతి ఐశ్వర్య దేవుడు కుబేరుడి స్థానం. అలాగే అన్నపూర్ణాదేవి స్థానం వంటిల్లు. సాక్షాత్తు ఆ పరమశివుడికే అన్నదానం చేసిన తల్లి అన్నపూర్ణాదేవి. అటువంటి వంటింటిలో కొన్ని వస్తువులు ఉంచితే దరిద్రం వస్తుందట..

kitchen
kitchen Vastu : ఇంట్లో ఒక్కో గదికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తర దిశకు అధిపతి ఐశ్వర్య దేవుడు కుబేరుడి స్థానం. అలాగే అన్నపూర్ణాదేవి స్థానం వంటిల్లు. సాక్షాత్తు ఆ పరమశివుడికే అన్నదానం చేసిన తల్లి అన్నపూర్ణాదేవి. అటువంటి అన్నపూర్ణాదేవికి నిలయం వంటిల్లు. అంతేకాదు వంటిల్లు మహిళల సౌభాగ్యానికి ప్రతీకగా నిలిచే పసుపు ఉండే స్థానం. అటువంటి వంటిల్లును చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కొన్ని వస్తువులు వంటగదిలో అస్సలు ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి అవి ఏమిటో తెలుసుకుందాం..
వంటింట్లో పెట్టుకోకూడని వస్తువులు
చీపురు : చీపురుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఎందుకంటే ఇంట్లో చెత్తను శుభ్రం చేసేది చీపురు. ఇంట్లో ఉండే అన్ని గదులతో పాటు వంటి గదిని కూడా శుభ్రం చేసే చీపురిని గౌరవించాలని చెబుతారు పెద్దలు. అందుకే చీపురుని తొక్కకూడదని, దాటకూడదని చెబుతారు. అయినా చీపురుని వంటి గదిలో ఉంచకూడదు. మరి చీపురు లక్ష్మీదేవి స్వరూపం అంటారు కదా దాన్ని వంటింటిలో ఎందుకు పెట్టుకోకూడదు అంటే..?అలా ఉంచితే అశుభం. వంటగదిలో చీపురు ఉంచితే ఇంట్లో వారికి అనారోగ్యాలు కలుగుతాయి. క్రిములు ఉంటాయి. అవి ఆహార పదార్ధాల్లో చేరితే అనారోగ్యాలు వస్తాయి. శాస్త్రం ప్రకారంగా చూస్తే చీరుపుని వంటింట్లో ఉంచితే అన్నపూర్ణా దేవి అలుగుతుందట. వంటిల్లు ధాన్యలక్ష్మి ఉండే చోటు. అంటే బియ్యం..పప్పులు వంటివి వంటింటిలోనే ఉంచుకుంటా కదా. అందుకే ధాన్యలక్ష్మీ ఉండే చోటుకూడా. చీపురిని శనీశ్వరుడి ఆయుధాల్లో ఒకటిగా చెబుతారు. అందుకని చీపురుని వంటింటిలో అస్సలు ఉంచకూడదట. అలా ఉంచితే ఇంట్లో ధాన్యం నిలువలు కూడా తగ్గిపోతాయట. అలాగే వంటింట్లో ఇల్లు తుడిచే గుడ్డలు గానీ..ఇల్లు తడిబట్ట పెట్టే మాక్ కర్ర, దులుపు కర్ర వంటివి ఉంచకూడదు.
Horse paintings : గుర్రాల పెయింటింగ్ ఇంట్లో ఉండొచ్చా..? అప్రమత్తంగా లేకుంటే ఆర్థిక కష్టాలే..!
అద్దం : అద్దం అనేది బెడ్ రూమ్ లేదా హాలు, బాత్రూమ్, వాష్ బేసిన్ ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుంటాం. అద్దంలో మన ప్రతిబింభం కనిపిస్తుందనే విషయం తెలిసిందే. అటువంటి అద్దం వంటింట్లో అద్దం ఉండకూడదు. ఎందుకంటే వంట గదిలో అద్దం ఉండడం వల్ల అగ్నికి ప్రతిబింబం ఏర్పడుతుంది. అంటే అద్దంలో మనం వంట చేసే సయమంలో పొయ్యి మంట దాంట్లో కనిపిస్తుంది. అందువల్ల అద్దంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇది ఇంటికి చాలా హానికరం. వంటగదిలో అద్దం ఉంటే కష్టాలు ఎప్పటికీ తీరవని..పైగా అది ప్రమాకరమని కూడా వాస్తు నిపుణులు చెబుతున్నారు.
మందులు (మెడిసిన్స్): వంటింట్లో ఇంట్లో ఉన్న అందరికి ఆహారం తయారయ్యే చోటు. ఇంట్లో అందరి ఆయురారోగ్యాల కోసం ఆహారం తయారయ్యే చోటు. అటువంటి వంట ఇంటిలో పొరపాటున కూడా మెడిసిన్స్ పెట్టకూడదు. అలా చెయ్యడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుందట. అనారోగ్యాలు, ఆర్ధిక ఇబ్బందులు కలిగే అవకాశముంటుందట.
పాడైన వస్తువులు : చాలామందికి కక్కుర్తితో వంటింట్లో వాడే వంట పాత్రలు లేదా ఇతర వస్తువులు పాడైపోయినా, విరిగి పోయానా, రంథ్రాలు పడినా సరే వాటిని ఇంట్లోనే అట్టేపెట్టుకుంటారు. ఇటువంటి వస్తువులు వంట ఇంటిలోనే కాదు అస్సలు ఇంట్లో ఎక్కడా ఉండకూడదు. వాటిని వాడకూడదు. పాడైపోయిన వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం అశుభం. వంటగదిలో పాడైపోయిన వస్తువులు, పనికిరాని పాత్రలు వంటివి అస్సలు ఉంచకూడదు.
వంటింట్లో తప్పక ఉండాల్సినవి..
వంటింటిలో కొన్ని నిండుకోకుండా అంటే ఎప్పుడు ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ అయి యిపోతే వెంటనే తెచ్చి పెట్టుకోవాలి. అవి ఏమిటో తెలుసుకుందాం..
ఉప్పు : వంట అంటే రుచి కోసం ఠక్కున గుర్తుకొచ్చేది ఉప్పు. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని పోగొట్టు పాజిటివ్ ఎనర్జీని తెచ్చే పదార్ధం. అందుకే చిన్నపిల్లలకు ఉప్పు(రాళ్ల ఉప్పు)తో దిష్టి తీస్తారు. ఉప్పు ఎప్పుడు ఇంట్లో అంటే వంటింటిలో ఉండేలా చూసుకోవాలి. లక్ష్మీదేవి పుట్టిన చోటు సముద్రం. అటువంటి సముద్రంలోంచో ఉప్పు తయారవుతుంది. సముద్రం నుంచి పుట్టిన ఉప్పు లక్ష్మీకి సోదర సమానం అని అంటారు. ఉప్పు ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని పారద్రోలుతుంది. వాస్తు దోషాలకు కూడా పరిహారంగా ఉపయోగపడతుంది. ఇంట్లో ఉండే డబ్బుని, ఆహరణాలకు ఉప్పులో కాసేపు ఉంచి బీరువాలో భద్రపరుచుకోవాలని చెబుతారు. ఉప్పు రాహు, కేతు ప్రభావాలను నివారిస్తుంది. కాబట్టి ఉప్పు ఇంట్లో ఎప్పుడు నిండుగా ఉండేలా చూసుకోవాలి..
పసుపు : మహిళల సౌభాగ్యానికి ప్రతీక. వంటలకు రంగు, రుచిని చేకూర్చే పదార్ధం. పసుపు వంటల్లోనే కాకుండా పూజల్లో పవిత్రంగా భావిస్తారు. ప్రతి వంటలోనూ చిటికెడైనా పసుపు వాడి తీరాల్సిందే. పసుపు వ్యాధి నిరోధకశక్తిని కలిగిస్తుంది. ఆరోగ్యానికి పసుపు చాలా చాలా ఉపయోగానిస్తుంది. శరీర ఆరోగ్యానికి..అందానికి పసుపు చాలా ఉపయోగపడుతుంది. పసుపు గురు గ్రహానికి ప్రతీక. ఇంట్లో పసుపు నిండుకుంటే గురు గ్రహదోషం కలుగుతుంది. అన్ని పనులకు ఆటంకాలు ఎదురవుతాయి.
బియ్యం : మనం తినే అన్నం బియ్యంతో తయారయ్యేదే కాబట్టి బియ్యం ఇంట్లో డబ్బా నిండుగా ఉండాలి. నిండుకోకుండా చూసుకోవాలి. భారతీయుల ప్రధాన ఆహార ధాన్యం. బియ్యం ధాన్య లక్ష్మికి ప్రతీక. శుక్ర గ్రహానికి ప్రతీక. వంటగదిలో బియ్యం నిండుకోవడం అంటే అందుకు శుక్రుడి దోషంగా భావిస్తారు. బియ్యం నిండుకోవడం అంటే డబ్బుకు కొరత అని భావించాలి. కాబట్టి వంటింట్లో బియ్యం నిండుకోకుండా చూసుకోవాలి.