Black Guava : నల్లజామతో…వృద్ధాప్య ఛాయలకు చెక్..

చూపరులను ఆకర్షించే ఈ నల్ల జామకాయల్లో పోషక విలువలు చాలా ప్రత్యేకమైనవని పరిశోధకులు చెబుతున్నారు..  యాంటీఏజింగ్ గుణాలు కలిగి ఉండటంతో  వృద్ధాప్యాన్ని నివారించడంలో నల్లజామ సహాయపడుతుంది.

Black Guava : నల్లజామతో…వృద్ధాప్య ఛాయలకు చెక్..

Black Guva

Black Guava : రోగ్యంకోసం అనేక మంది వివిధ రకాల పండ్లు తింటుంటారు. అయితే మనం రోజు తీసుకునే పండ్లలో జామపండుకు పత్యేకమైన స్ధానం ఉంది. అందుబాటు ధరలో లభించటంతోపాటు, మంచి రుచికరమైన పండుగా జామపండును చెప్పవచ్చు. పండ్లలోనే జామ పండు మన ఆరోగ్యాన్ని కాపడటానికి ఎంతో ఉపయోగపడుతుంది. అపరిమిత పోషకాల నిలయంగా జామను చెప్పవచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం జామ పండు తినటం వల్ల చేకూరుతుంది. ఇదిలా వుంటే జామ కాయ గ్రీన్ కలర్ లో ఉండటాన్ని ఇప్పటి వరకు మనం చూసుంటాం. అయితే ఈ మధ్యకాలంలో నల్ల జామకాయలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. మామూలు జామ కన్నా నల్ల జామకాయల్లో పోషక విలువలు అధికమని పలు అధ్యయనాల్లో తేలింది.

నల్ల జామకాయ తొక్క నల్లగా ఉండి లోపల ఎర్రటి గుజ్జును కలిగి ఉంటుంది. సాధారణ జామ పండు తో పోలిస్తే దీంట్లో పోషకాలు రెట్టింపు.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నాయి. నల్ల జామకాయలో విటమిన్స్, ఖనిజాలు, క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఈ జామ పండును తీసుకోవడం వలన రక్తహీనత ను తగ్గిస్తుంది. రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారిని వీటిని తరచూ తీసుకోవాలి.

తాజా అధ్యయనల ప్రకారం, మాములు జామ పండు తో పోలిస్తే దీంట్లో కంటి సమస్యలను తగ్గించే గుణాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. నల్ల జామకాయ మలబద్దకం సమస్యను నివారిస్తుంది. ఈ పండు ఫైల్స్ సమస్యకు చెక్ పెడుతుంది. బీహార్ విశ్వ విద్యాలయం లోనీ శాస్త్రవేత్తలు 2 సంవత్సారాలు క్రితం ఈ నల్ల జామకాయ ను నాటారు. వాటి ఫలితాలు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. ఈ పంటను త్వరోలోనే వాణిజ్య సాగులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

చూపరులను ఆకర్షించే ఈ నల్ల జామకాయల్లో పోషక విలువలు చాలా ప్రత్యేకమైనవని పరిశోధకులు చెబుతున్నారు..  యాంటీఏజింగ్ గుణాలు కలిగి ఉండటంతో  వృద్ధాప్యాన్ని నివారించడంలో నల్లజామ సహాయపడుతుంది. ఈ పండు తీసుకోవడం వలన వృద్ధాప్య ఛాయలను దరి చేరనివ్వకుండా చేస్తుంది. చర్మం పై ఉన్న ముడతలు తొలగించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాదు ఆరోగ్య పరంగా ఈ నల్ల జామ కాయను తినటం వల్ల ఎంతో మేలు చేకూరుతుందని చెబుతున్నారు.