Cold : జలుబు నివారణ ఇంటి చిట్కాలతో..ఎలాగంటే?

పూర్వ కాలంలో నుండి గృహ వైద్యంతోనే మన పెద్దలు జలుబు, తలనొప్పి వంటి బాధలనుండి విముక్తిపొందేవారు. అయితే ప్రస్తుతం తరానికి ఇంటి చిట్కాల గురించి అంతగా అవగాహన లేమి కారణంగా వాటిని వినియోగించుకులేకపోతున్నారు.

Cold : జలుబు నివారణ ఇంటి చిట్కాలతో..ఎలాగంటే?

Cold

Cold : ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందే వ్యాధిగా జలుబును చెప్పవచ్చు. జలుబుకు ఎలాంటి మందులు లేవు. చాలా మంది జలుబు చేస్తే మంచిదని చెప్తుంటారు. శరీరంలో ఉన్న వేడి తగ్గించటంలో జలుబు తోడ్పడుతుందని చెబుతారు. జలుబు చేయగానే చాలా మంది మెడికల్‌ షాప్‌కు వెళ్ళి మాత్రలు తెచ్చుకుంటుంటారు. మాత్రలు వేసినా వేయకపోయినా జలుబు తగ్గది మాత్రం వచ్చిన వారం పదిరోజుల తరువాత మాత్రమే. అయితే జలుబును తగ్గించుకునేందుకు మన ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

పూర్వ కాలంలో నుండి గృహ వైద్యంతోనే మన పెద్దలు జలుబు, తలనొప్పి వంటి బాధలనుండి విముక్తిపొందేవారు. అయితే ప్రస్తుతం తరానికి ఇంటి చిట్కాల గురించి అంతగా అవగాహన లేమి కారణంగా వాటిని వినియోగించుకులేకపోతున్నారు. చలికాలంలో జలుబు, దగ్గు అనేవి సహజంగానే ఎక్కువగా వచ్చే సమయం. ఈసమయంలో వచ్చిన జలుబు వెంటనే తగ్గాలి అంటే మెడిసిన్ తో కుదరని పని ఇందుకు సమయం పడుతుంది. అయితే గృహచిట్కాలను ట్రై చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

జలుబు నివారణకు చిట్కాలు ;

జలుబుతో బాధపడుతూ.. వెంటనే రిలీజ్ కావాలనుకునేవారు ఎనిమిది మిరియాలను నెయ్యిలో వేయించుకుని వాటిని తినాలి. తర్వాత గోరు వెచ్చని పాలను తాగాలి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు తగ్గు ముఖం పడుతుంది.

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఓ పది ఆకులతో పేస్ట్‌ తయారు చేసి మజ్జిగలో క లిపేసుకుని రోజూ తాగితే కాలేయం వ్యర్థపదార్థాల నుంచి రక్షణ పొందుతుంది. రోజూ ఓ 8 ఆకుల్ని మిర్యాలతో కలిపి తింటే ముక్కులో వచ్చే అలర్జీలు తగ్గిపోతాయి.

తులసి ఆకులు, వ్యాధి నిరోధక శక్తిని వృద్ధి చేయడమే కాదు, శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఓ ఐదారు ఆకుల కషాయాన్ని మరగించి టీ మాదిరి చేసుకుని తాగితే, దగ్గు, జలుబు, ఆస్తమా అదుపులోకి వస్తాయి.

జలుబుతో ముక్కు కారుతుంటే.. కొంచెం చింతపండు గుజ్జు , టమోట రసం, మిరియాల పొడి, ఒక ఎండు మిరప కాయ, కొంచెం ఉప్పు లతో వేసుకుని సుప్ లా తయారు చేసుకుని .. వేడి వేడిగా తాగితే సూప్ ని వేడిగా తాగితే జలుబు ముక్కు కారటం తగ్గుతుంది.

లవంగాలు, తమలపాకు రసం, అల్లం రసాన్ని తేనె తో కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని సేవించిన వెంటనే జలుబు తగ్గుతుంది. కఫంతో కూడిన జలుబుతో ఇబ్బంది పడుతున్నవారు మిరియాలను వేయించి పొడి చేసుకుని అర టీ స్పూన్ చొప్పున మూడు నాలుగు రోజుల పాటు ఉదయాన్నే తీసుకోవాలి.

వెల్లుల్లి వల్ల జలుబు, దగ్గు తగ్గుతాయి అని చాలా మందికి తెలియదు. వెల్లుల్లిలో అలిసిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియా గుణాలతో ఉంటుంది. కొన్ని వెల్లుల్లి ముక్కలను బాగా రోస్ట్ చేసి తీసుకోండి. ఇలా రోజుకు ఒకటికి రెండు సార్లు చేయండి. వెల్లుల్లి జలుబును తగ్గిస్తుంది.

వేడి నీటిలో లేదా పాలలో ఒక టీ స్పూన్ పసుపు కలపి తాగండి. దీని వల్ల జలుబు, దగ్గు నుంచి మీకు ఉపశనం కలుగుతుంది. ఈ చిట్కా పిల్లలకే కాదు.. పెద్దలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. పసుపులో ఆంటీ బాక్టీరియల్ గుణాలు జలుబు , దగ్గు నుంచి కోలుకోవడంలో ఉపయోగపడతాయి.

అల్లం టీ వల్ ఎన్నో లాభాలు ఉన్నాయి. జలుబు, దగ్గు ఉన్న సమయంలో మీరు అల్లం టీ తాగితే రిలీఫ్ గా ఉంటుంది. దీని కోసం మీరు చేయాల్సిందల్లా కొన్ని అల్లం ముక్కలు తీసుకోని వాటిని నీటిలో లేదా పాలలో కలిపండి. తరువాత దాన్ని బాగా మరిగించి తాగండి.