Vitamin D : ఆందోళన కలిగిస్తున్న విటమిన్ డి లోపం ! ఆ సంస్ధ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు

సూర్యకాంతి నుండి శరీరానికి తగినంత మొత్తంలో విటమిన్ డి లభించినప్పటికీ కొన్నిసార్లు తగిన మొత్తంలో మన శరీరానికి విటమిన్స్ డి అందక పోవచ్చు అటువంటి పరిస్థితిలో, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలిన చెబుతున్నారు.

Vitamin D : ఆందోళన కలిగిస్తున్న విటమిన్ డి లోపం ! ఆ సంస్ధ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు

vitamin D

Vitamin D : టాటా 1mg ల్యాబ్స్ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం, దాదాపు 76 శాతం మంది భారతీయ జనాభా విటమిన్ డి లోపంతో బాధపడుతున్నట్లు తేలటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భారతదేశంలోని 27 నగరాల్లో నివసిస్తున్న 2.2 లక్షల మంది వ్యక్తులపై పరీక్షలు నిర్వహించిన తర్వాత డేటాను విశ్లేషించారు. 25 ఏళ్లు అంతకంటే తక్కువ వయస్సు ఉన్న యువకులు విటమిన్ డి లోపానికి గురవుతున్నట్లు కనుగొన్నారు. మొత్తం సంఖ్యలో 79 శాతం పురుషులు మరియు 75 శాతం మహిళలు ఉన్నట్లు గుర్తించారు.

విటమిన్ డి, సూర్యరశ్మి విటమిన్ అని కూడా పిలుస్తారు, బలమైన రోగనిరోధక శక్తి, ఎముకలు, మానసిక ఆరోగ్యం, కండర ద్రవ్యరాశి మరియు జీవక్రియకు కీలకం. విటమిన్ డి యొక్క సిఫార్సు స్థాయిలు శరీరానికి అందనప్పుడు విటమిన్ లోపానికి దారితీయవచ్చు. విటమిన్ డి లోపం వివిధ మార్గాల్లో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. విటమిన్ డి లోపం వల్ల రికెట్స్, మధుమేహం, డిప్రెషన్, కీళ్ళ వాతము, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి నిపుణుల సూచనలు;

సూర్యకాంతి నుండి శరీరానికి తగినంత మొత్తంలో విటమిన్ డి లభించినప్పటికీ కొన్నిసార్లు తగిన మొత్తంలో మన శరీరానికి విటమిన్స్ డి అందక పోవచ్చు అటువంటి పరిస్థితిలో, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలిన చెబుతున్నారు.

పుట్టగొడుగులు, కొవ్వు చేపలు, పాల ఉత్పత్తులు, గుడ్లు ఎర్ర మాంసం, రోజులో కొంత సమయం సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. ముఖం, కాళ్ళు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. రోజుకు 30 నిమిషాలు ఎండతగిలేలా చూసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఎముకలు, కండరాలు మరియు నరాలను ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ డి అవసరం విటమిన్ డి మన కండరాలు, నరాలు మరియు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది.మరీ లోపం ఉంటే మాత్రం వైద్యుల సిఫార్సుతో విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవాలని సూచిస్తున్నారు.

పాలు విటమిన్ డి మరియు కాల్షియం యొక్క అద్భుతమైన మూలం. ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తాగడం ద్వారా, రోజుకు అవసరమైన విటమిన్ డిలో నాలుగవ వంతు లభిస్తుంది. గుడ్డులోని తెల్లటి భాగంలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. గుడ్లు తినడం ద్వారా, మనకు అవసరమైన విటమిన్ డి మనకు లభిస్తుంది. చేపలు తినడానికి ఇష్టపడే వ్యక్తులు విటమిన్ డి ఆహారాలుగా చేపలను ఆహారంలో చేర్చవచ్చు. సాల్మన్ చేప, పలాసా చేప, ట్యూనా చేపవిటమిన్ డి ఎక్కవ ఉన్న చేపలను ఆహారంలో భాగం చేసుకోవచ్చు.

పుట్టగొడుగులు సూర్యకాంతిలో పెరుగుతాయి కాబట్టి, వాటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. టోఫు, సోయ్ పాలు మరియు సోయా పెరుగు వంటి సోయా పదార్ధాలు తినడం వల్లవిటమిన్ డి లోపం నివారించవచ్చు. పాలు కంటే ఈ ప్రత్యేక విటమిన్ లోపాన్ని తీర్చగల సామర్థ్యం పెరుగుకు ఉంది . కాబట్టి పెరుగును రోజువారిగా తీసుకోవటం వల్ల లోపం లేకుండా చూడవచ్చు. నారింజ రసం ద్వారా విటమిన్ డి లభిస్తుంది. శీతాకాలంలో విటమిన్ డి స్థాయిలు తగినంతగా ఉండేలా చూసుకోవాలని గుర్తుంచుకోవాలి.