Viral Video: తరగతి గదిలో విద్యార్థుల ముందు టీచర్ డ్యాన్స్.. తీవ్ర విమర్శలు
తరగతి గదిలో విద్యార్థుల ముందు ఓ టీచర్ డ్యాన్స్ చేశారు. ఆ టీచర్ కు ఫ్లయింగ్ కిస్సెస్ ఇస్తూ విద్యార్థులు ప్రోత్సహించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే, ఆ టీచర్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఐటం సాంగ్ ‘పాట్లీ కమరియా మోరి’ పాటకు విద్యార్థులు, టీచర్ కలిసి డ్యాన్స్ చేయడమే అందుకు కారణం.

Viral Video: తరగతి గదిలో విద్యార్థుల ముందు ఓ టీచర్ డ్యాన్స్ చేశారు. ఆ టీచర్ కు ఫ్లయింగ్ కిస్సెస్ ఇస్తూ విద్యార్థులు ప్రోత్సహించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే, ఆ టీచర్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఐటం సాంగ్ ‘పాట్లీ కమరియా మోరి’ పాటకు విద్యార్థులు, టీచర్ కలిసి డ్యాన్స్ చేయడమే అందుకు కారణం.
తరగతి గదిలో టీచర్ ఈ పాటకు డ్యాన్స్ చేయడం ఏంటని, విలువలు మంటగలిపేలా ఇలా ప్రవర్తించవద్దని కామెంట్లు చేస్తున్నారు. ఆ సమయంలో ఒకరు అక్కడే ఉండి టీచర్, విద్యార్థుల డ్యాన్సుకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీశారు. గతంలోనూ టీచర్ల డ్యాన్సు వీడియోలు బాగానే వైరల్ అయ్యాయి. అయితే, ఆయా టీచర్లు మంచి పాటలకు, సరైన రీతిలో డ్యాన్స్ చేశారని, ఇప్పుడు మాత్రం ‘పాట్లీ కమరియా మోరి’ పాటకు విద్యార్థులతో టీచర్ డ్యాన్స్ చేయడం తమకు నచ్చలేదని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు.
ఉపాధ్యాయుడు-విద్యార్థుల మధ్య ఉండాల్సిన గురు, శిష్య సంబంధానికి తగ్గట్లు వ్యవహరించాలని అంటున్నారు. ఇటువంటి టీచర్ల వల్లే విద్యా విధానంలో నాణ్యత రోజురోజుకీ దిగజారుతోందని కొందరు కామెంట్లు చేశారు. బాధ్యతారహితంగా వ్యవహరించకూడదని నెటిజన్లు చివాట్లు పెడుతున్నారు.
mera desh badal raha hai, aage badh raha hai ?? pic.twitter.com/LDK4NtaLvr
— . (@stormiismykid) December 26, 2022