గంగూభాయ్‌ ‘గోలీమార్’కు పదేళ్లు..

గోపిచంద్, పూరి జగన్నాధ్ కాంబోలో రూపొందిన ‘గోలీమార్’ నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంటోంది..

  • Published By: sekhar ,Published On : May 27, 2020 / 08:51 AM IST
గంగూభాయ్‌ ‘గోలీమార్’కు పదేళ్లు..

గోపిచంద్, పూరి జగన్నాధ్ కాంబోలో రూపొందిన ‘గోలీమార్’ నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంటోంది..

మాచో స్టార్ గోపిచంద్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్..‘‘గోలీమార్’’.. 2010 మే 27న విడుదలైన ఈ చిత్రం 2020 మే 27 నాటికి విజయవంతంగా పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. పూరి ఫార్మాట్‌లో సాగే ఈ కథలో గోపిని గంగూభాయ్‌గా సరికొత్త క్యారెక్టర్లో ఆకట్టుకునేలా చూపించాడు పూరి.

తన మార్క్ డైలాగ్స్ డైనమెట్స్‌లా పేలాయి. ప్రియమణి నటనకు ఆస్కారమున్న పాత్రలో అలరించింది. చక్రి సంగీతం, నేపథ్య సంగీతం, శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యాయి. రోజా, నాజర్, కెల్లీ డోర్జీ, షవార్ అలీ తదితరులు తమ పాత్రల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పూరి స్టైల్ పోలీస్ సినిమాల్లో అలాగే గోపి కెరీర్లో స్పెషల్ ఫిల్మ్‌గా ‘గోలీమార్’ గుర్తుండిపోతుంది.

Golimaar

‘మగాళ్లు వట్టి మాయగాళ్లే’, ‘సల్లాం పోలీస్’, ‘గుండెల్లో ఏదో సడి’ వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలీ, జీవా, ఎమ్.ఎస్.నారాయణ, పావలా శ్యామల, సత్యం రాజేష్, అజయ్, సలీం బేగ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్ : మార్తాండ్ కె.వెంకటేష్, ఫైట్స్ : చిన్నా.