బర్త్‌డే కి బ్లాక్ బస్టర్ ఫస్ట్‌లుక్..

  • Published By: sekhar ,Published On : July 18, 2020 / 01:33 PM IST
బర్త్‌డే కి బ్లాక్ బస్టర్ ఫస్ట్‌లుక్..

విభిన్నమైన చిత్రాలతో అటు తమిళంతో, ఇటు తెలుగులోనూ హీరోగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోని. ‘నకిలీ’, ‘డాక్టర్ సలీమ్’ చిత్రాలతో అప్పటికే తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించిన విజ‌య్ ఆంటోని ‘బిచ్చ‌గాడు’ చిత్రంతో తమిళంలోనే కాదు.. తెలుగులోనూ బ్లాక్ బస్ట‌ర్ సాధించి తెలుగు ఆడియెన్స్ హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్నారు.

Vijay Antony

ఈ నెల 24న విజయ్ ఆంటోని పుట్టినరోజు. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని కొత్త చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సీక్వెల్ అండ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఫస్ట్ లుక్ అంటూ మూవీ యూనిట్ హింట్ ఇచ్చింది. దీంతో విజ‌య్ ఆంటోని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచిన ‘‘బిచ్చ‌గాడు’’ చిత్రానికి సీక్వెల్ ఉండ‌వ‌చ్చున‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

Vijay Antony