#MENTOO : Being a man is not easy.. అబ్బాయిల కష్టాలపై సినిమా.. #MENTOO టీజర్ రిలీజ్..

#MENTOO సినిమాని లాంటెర్న్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థలో, మౌర్య సిద్దవరం నిర్మాణంలో, శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష, రియా సుమన్, ప్రియాంక, కౌశిక్ లు నటిస్తున్నారు. తాజాగా #MENTOO టీజర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించగా హీరో శర్వానంద్.................

#MENTOO : Being a man is not easy.. అబ్బాయిల కష్టాలపై సినిమా.. #MENTOO టీజర్ రిలీజ్..

a movie on mens problems #MENTOO movie teaser released by sharwanand

#MENTOO :  కొన్ని రోజుల క్రితం #METOO అంటూ కొంతమంది అమ్మాయిలు వారిపై వస్తున్న లైంగిక వేధింపులపై మాట్లాడారు. ఇది అప్పట్లో బాగా వైరల్ అయింది. అలాగే సొసైటీలో ప్రతి ఒక్కరు అమ్మాయిల సమస్యల గురించి మాట్లాడే వాళ్ళే కానీ అబ్బాయిలా సమస్యల గురించి మాట్లాడేవారు ఉండరు. గతంలో కొంతమంది ఫెమినిస్ట్స్ మరీ ఓవర్ గా మా ఇష్టం ఎంతమందితో అయినా తిరుగుతాం అంటూ మాట్లాడిన కొని వ్యాఖ్యలు ట్రోల్ కూడా అయ్యాయి. ఇప్పటికే చాలా సినిమాల్లో అమ్మాయిల కష్టాలని చూపించారు. అబ్బాయిల్లోనే కాదు అమ్మాయిల్లో కూడా చెడ్డవాళ్ళు ఉంటారని, వారి వల్ల అబ్బాయిలు బాధపడతారని, అబ్బాయిల కష్టాలని చూపిస్తూ, కొన్ని రియల్ గా జరిగిన సంఘటనల ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతుంది. అదే #MENTOO.

#MENTOO సినిమాని లాంటెర్న్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థలో, మౌర్య సిద్దవరం నిర్మాణంలో, శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష, రియా సుమన్, ప్రియాంక, కౌశిక్ లు నటిస్తున్నారు. తాజాగా #MENTOO టీజర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించగా హీరో శర్వానంద్ ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. Being a man is not easy అనే క్యాప్షన్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ టీజర్ లో.. అమ్మాయిలు మా ఇష్టం, డబ్బులు ఉంటేనే, గ్రీన్ కార్డు ఉంటేనే పెళ్లి చేసుకుంటాం, చిన్న వాటికి తిడతావా అంటూ రియల్ గా జరిగే కొన్ని సంఘటనల వాయిస్ తో మొదలుపెట్టారు. అబ్బాయిలతోనే ప్రాబ్లమ్స్ అన్ని అని అమ్మాయిలు అంటే, అమ్మాయిలని డీల్ చేయడం చాలా కష్టం అని అబ్బాయిలు చెప్పే డైలాగ్స్ ని చూపించారు. అబ్బాయిల తప్పులేకపోయినా ఒక అమ్మాయి కావాలని కంప్లైంట్ ఇచ్చినా అది కరెక్ట్ కాదా అవునా అని ఆలోచించకుండా నిర్ణయం తీసేసుకొని అబ్బాయిలకి నష్టం కలిగించడం, అలాగే పెళ్ళైన భర్తల కష్టాలు చూపించారు. ఇలా అమ్మాయిల వల్ల అబ్బాయిలు పడే కష్టాలని, అబ్బాయిల ఫ్రస్టేషన్ ని చూపించారు. చివర్లో హీరోలు ఒక పర్యాటక ప్రదేశానికి, ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లి ఇక్కడ ఏంట్రా ఇంత ప్రశాంతంగా ఉంది అంటే ఇక్కడ అమ్మాయిలు లేరు కదా అని అనడంతో టీజర్ ముగుస్తుంది.

#TAJDividedByBlood : మొఘల్ రాజవంశం, తాజ్ మహల్ పై జీ5 సిరీస్..

ఇప్పటివరకు అందరూ అమ్మాయిల వైపే మాట్లాడి, వాళ్ళ కష్టాలు చూపించడంతో మొదటి సారి ఈ సినిమాలో అబ్బాయిల కష్టాలు, సమస్యల గురించి మాట్లాడుతుండటంతో ఈ టీజర్ వైరల్ గా మారింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.