Acharya: హిందీలోకి ఆచార్య.. చెర్రీ పాపులారిటీ క్యాష్ చేసుకునేందుకేనా?

పాన్ ఇండియా మార్కెట్ పైనే ఇప్పుడు స్టార్ హీరోల కన్ను. తెలుగులో మెగాస్టార్ అయినా.. హిందీపై ఇన్నాళ్లు పెద్దగా కాంన్సట్రేట్ చేయని చిరూ... ఇప్పుడు తన ఆచార్య సినిమాని హిందీలో రిలీజ్..

Acharya: హిందీలోకి ఆచార్య.. చెర్రీ పాపులారిటీ క్యాష్ చేసుకునేందుకేనా?

Acharya (1)

Acharya: పాన్ ఇండియా మార్కెట్ పైనే ఇప్పుడు స్టార్ హీరోల కన్ను. తెలుగులో మెగాస్టార్ అయినా.. హిందీపై ఇన్నాళ్లు పెద్దగా కాంన్సట్రేట్ చేయని చిరూ… ఇప్పుడు తన ఆచార్య సినిమాని హిందీలో రిలీజ్ చేస్తున్నారు. రామ్ చరణ్ తో కలిసి తన సినిమాను నార్త్ లో ఆడించేలా స్కెచ్ వేశారు. ట్రిపుల్ ర్ తో వచ్చే కొడుకు పాపులారిటీని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారా.. బాలీవుడ్ ఆడియెన్స్ కు కనెక్టయ్యే కంటెంట్ ఆచార్యలో ఉందా అనే చర్చ ఇప్పుడు టాలీవుడ్ లో జరుగుతుంది.

Thalaivar169: మరోసారి రజినీతో ఐష్.. రోబో లాంటి బ్లాక్ బస్టర్ అవుతుందా?

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబో మూవీ ఆచార్య.. తెలుగులో బిగ్ సెన్సేషన్. తండ్రీకొడుకులు ఒకే సినిమాలో ఫుల్ లెంత్ రోల్స్ లో కలిసొస్తే ఫ్యాన్స్ కు పండగే. అదీ ఒక్క ఫ్లాప్ కూడా లేని కొరటాల శివ డైరెక్షన్ లో మెగా హీరోలు రాబోతుంటే.. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఆడియెన్స్. అయితే ఇక్కడ ఆచార్య అంటే క్రేజీనే కాని, హిందీ ప్రేక్షకులకు కూడా ఈ మూవీని చూపించాలనుకంటున్న మెగా హీరోల డెసిషన్ ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది. పుష్పతో బన్నీ సాధించిన మార్కెట్ ను చిరూ, చరణ్ క్రాస్ చేస్తారా అన్నదానిపై చర్చలు నడుస్తున్నాయి.

Esha Gupta: స్కిన్ షోతో పిచ్చెక్కిస్తున్న ఈషా

గతంలో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ హిందీ సిసినిమాలతో నార్త్ ఆడియెన్స్ ను పలకరించినా అక్కడి ఆడియన్స్ ఆదరించలేదు. అయితే ఇప్పటి వరకూ కొరటాల శివ నుంచి వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్సే. పైగా ఆయన చూజ్ చేసుకునే సబ్జెక్టులన్నీ నేషనల్ ఆడియెన్స్ కు కనెక్టయ్యే సబ్జెక్ట్సే. పైగా యూట్యూబ్ లో హిందీ డబ్బింగ్ తో రిలీజ్ అయిన కొరటాల సినిమాలు అక్కడివారిని కూడా ఎట్రాక్ట్ చేశాయి. ఆ నమ్మకంతోనే ఆచార్య హిందీ రిలీజ్ కి ప్లాన్ చేశారు.

Movie Releases: ప్చ్.. ఈ వారం కూడా సందడి లేని థియేటర్లు!

ట్రిపుల్ ఆర్ రిలీజ్ కు ముందే రామ్ చరణ్ కు పాన్ ఇండియా క్రేజ్ క్రియేట్ అయ్యింది. జక్కన్న సినిమా రిలీజ్ అయితే ఆ క్రేజ్ డబుల్ అవుతుంది. ఈ స్ట్రాటజీ ప్రకారమే ఆర్ఆర్ఆర్ రిలీజయ్యాకే ఆచార్యను తీసుకొచ్చేలా ముందు నుంచి ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టే మార్చ్ 25న ట్రిపుల్ ఆర్ రిలీజయ్యాక.. ఏప్రిల్ 29న ఆచార్య రాబోతుంది. చూస్తుంటే భలే మంచి కాస్ల్సీ భేరమే అన్నట్టుంది పరిస్థితి. అంతా అనుకున్నట్టు జరిగితే కొడుకు స్టార్ డం తో తండ్రి హిందీలోనూ హిట్ కొట్టే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి.