Jackie Shroff : పేదరికం కుటుంబాన్ని దగ్గరగా ఉంచుతుందన్న జాకీష్రాఫ్ వీడియో వైరల్
కొందరు నటుల జీవితాలు తెరపై కనిపించినంత అందంగా ఉండవు. ఈరోజు పెద్ద స్టార్లుగా వెలుగొందుతున్న వారంతా ఒకప్పుడు ఎన్నో కష్టాలు, నష్టాలు చవి చూసినవారే. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తన కుటుంబం గురించి పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది.

Jackie Shroff
Jackie Shroff : అసలు పేరు జై కిషన్ కాకుభాయ్ ష్రాఫ్ .. కానీ జాకీ ష్రాఫ్ అనే పేరుతో పాపులర్ స్టార్ అయ్యారు. స్టార్ డమ్ సాధించడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఇక వ్యక్తిగత జీవితంలోను ఎన్నో సవాళ్లు ఎదుర్కున్నారు. తన కుటుంబం పేదరికాన్ని ఎలా జయించిందో ఆయన షేర్ చేసుకున్న పాత వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
Jackie Shroff : జాకీ ష్రాఫ్‌ను వెంటాడే గతం.. ఇంత విషాదమా?
బాలీవుడ్‌ను ఒకప్పుడు ఒక ఊపు ఊపిన నటుడు జాకీ ఫ్రాష్. చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. ఈరోజు ఆయన అనుభవిస్తున్న స్టార్ డమ్ వెనుక ఎన్నో కష్టనష్టాలున్నాయి. వాటిని అన్నింటికి అధిగమించి ఈరోజు ఆయన సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నారు. ష్రాఫ్ కుటుంబం ఒకప్పుడు ఇరుకైన ఇంట్లో ఉండేవారట. తమని సంతోషంగా ఉంచడం కోసం తన తల్లి చేసిన త్యాగాలను ష్రాఫ్ వీడియోలో షేర్ చేసుకున్నారు. 10వ తరగతి స్కూలు ఫీజు కూడా కట్టలేని పరిస్థితులు ఎదుర్కున్నారట. కుటుంబ పోషణ కోసం ఆమె చీరలు అమ్మేవారట. ఓవైపు తమ చదువులు, కుటుంబ ఆర్ధిక కష్టాలు అధిగమించడం కోసం ఆమె చేసిన త్యాగాలు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పాయన్నారు ష్రాఫ్.
Adipurush : ఆదిపురుష్ మూవీతో బాలీవుడ్‌కి భయం పుడుతుందా.. ఎందుకో తెలుసా?
తల్లికి సొంత గదిని నిర్మించి ఇవ్వడం సంతోషం అనిపించినా అదే గదిలో తల్లి ఒంటరిగా గుండెపోటుతో చనిపోవడం ఎంతో బాధించిందని ష్రాఫ్ ఎమోషనల్ అయ్యారు. అందరూ కలిసి ఒకే గదిలో పడుకున్న రోజులను ష్రాఫ్ గుర్తు చేసుకున్నారు. పేదరికం కుటుంబసభ్యుల్ని దగ్గరగా ఉంచుతుందని చెప్పుకొచ్చారు. ష్రాఫ్ లాంటి ఎందరో నటులు తెర ముందు జీవితం వేరు.. తెరవెనుక వారు అధిగమించిన కష్టాలు వేరు. EngiNerd అనే ట్విట్టర్ యూజర్ ద్వారా షైరైన ఈ వీడియో అందరిలో స్ఫూర్తి నింపుతోంది.
I’ve seen his some of the interviews clips on Instagram, Jackie shroff has much more depth in thinking than it appears to be. pic.twitter.com/6SoFGxd45N
— EngiNerd. (@mainbhiengineer) June 6, 2023