Evaru Meelo Koteeswarulu : రూ. 25 లక్షలు గెలుచుకున్న రామ్ చరణ్!..ఎందులో తెలుసా ?

తెలుగులో బాగా పాపులర్ అయిన ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ గేమ్ త్వరలోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బుల్లితెరపై జెమిని ఛానెల్ లో ఈ గేమ్ షో ఆగస్టు 16వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. 

Evaru Meelo Koteeswarulu : రూ. 25 లక్షలు గెలుచుకున్న రామ్ చరణ్!..ఎందులో తెలుసా ?

Ramcharan

Actor Ram Charan : మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ రూ. 25 లక్షలు గెలుచుకోవడం ఏంటీ. ఆశ్చర్యపోతున్నారా ? కానీ..ఆయన గేమ్ లో పాల్గొని ఆ డబ్బును గెలుచుకున్నారు. ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ అనే గేమ్ తెలిసిందే. తెలుగులో బాగా పాపులర్ అయిన ఈ గేమ్ త్వరలోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బుల్లితెరపై జెమిని ఛానెల్ లో ఈ గేమ్ షో ఆగస్టు 16వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది.

Read More : Radhe Shyam: సంక్రాంతి రిలీజ్..! అప్‌డేట్ ఆన్ ది వే డార్లింగ్స్..

టాలీవుడ్ యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ హోస్ట్ గా కనబడనున్నారు. ఈ షోలో ప్రశ్నల ఫార్మాట్, బహుమతి రెట్టింపు అవుతూ..కోటి రూపాయల వరకు చేరుకోవాల్సి ఉంటుంది. తొలి ఎపిసోడ్ లో రామ్ చరణ్ కనిపించబోతున్నారు. ఇందులో జూ.ఎన్టీఆర్ అడిగే ప్రశ్నలకు చెర్రీ ఠకఠకా సమాధానాలు చెప్పినట్లు, చివరకు రూ. 25 లక్షలు గెలుచుకున్నట్లు సమాచారం. ఆర్ఆర్ఆర్ (RRR) హీరోల కాంబినేషన్ లో పిక్చరైజ్ చేసిన ఈ తొలి ఎపిసోడ్ ఆగస్టు 16న ప్రసారం కాబోతోంది. ఇక అక్కడి నుంచి వరుసగా ఎపిసోడ్స్ ప్రసారం కానున్నాయి. ఇప్పటికే పలు ఎపిసోడ్ ల షూటింగ్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది.

Read More : Airtel Prepaid Recharge : ఎయిర్‌టెల్ కస్టమర్లకు షాక్.. ప్రీపెయిడ్ ప్లాన్ ధరలను పెంచుతూ ప్రకటన

ఇప్పటకే ఈ ‘షో’కి సంబంధించిన కార్యక్రమాలు అన్నపూర్ణ స్టూడియోలో శరవేగంగా సాగుతుండగా..ఫస్ట్ డే షూటింగ్‍లో సెలబ్రిటీ గెస్ట్‌గా రామ్ చరణ్ రాబోతున్నారు. ఫస్ట్ ఎపిసోడ్‌లో ఆర్ఆర్(ఎన్టీఆర్, రామ్ చరణ్) సందడి చేయబోతున్నారు. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో నటిస్తున్న జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు ఆన్ సెట్స్ మీదే కాదు.. బయట కూడా కలిసిపోయి ఉంటారు. ఈ క్రమంలోనే చరణ్‌తోనే ఫస్ట్ ఎపిసోడ్ చేయబోతున్నారు ఎన్టీఆర్.. వెండితెరపై ఆర్(రాజమౌళి) దర్శకత్వంలో ఆర్ఆర్(ఎన్టీఆర్, రామ్ చరణ్) ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. అంతకుముందే వీరిద్దరి కాంబినేషన్ బుల్లితెరపై ఆర్ఆర్ ది బెస్ట్ ప్రోగ్రామ్ అవ్వొచ్చని అంచనా.