బెస్ట్ క్వారంటైన్ అవార్డ్ Goes To…

సీనియర్ నటుడు సుమన్ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

  • Published By: sekhar ,Published On : May 4, 2020 / 07:40 AM IST
బెస్ట్ క్వారంటైన్ అవార్డ్ Goes To…

సీనియర్ నటుడు సుమన్ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

ఈ లాక్‌డౌన్ పుణ్య‌మా అని ఇళ్లకే పరిమితమైన చాలామంది ఉత్సాహవంతులు త‌మ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. సెలబ్రిటీలు తమ రోజువారీ పనులతో పాటు వివిధ ఛాలెంజ్‌లు విసురుతుంటే సామాన్యులు రకరకలా మీమ్స్, వీడియోలతో సందడి చేస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ గురించిన మీమ్స్ ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో చూశాం.

తాజాగా సీనియర్ నటుడు సుమన్ మీమ్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అది అలాంటి ఇలాంటి మీమ్ కాదండోయ్. సుమన్ ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అవార్డ్ అందుకుంటున్న ఫొటో అది. ఏం అవార్డ్ అనుకుంటున్నారు.. ‘బెస్ట్ క్వారంటైన్’ అవార్డ్. లాక్‌డౌన్ నేపథ్యంలో సెలూన్లు మూసేసి ఉండడంతో మగాళ్లంతా జుట్టు, గెడ్డాలు పెరిగిపోయి ఆ చిరాకు భార్యలు మీద చూపిస్తున్నారు. అలా గెడ్డం, జుట్టు పెంచేసిన సుమన్‌కి మోడీ ఈ అవార్డ్ అందిస్తున్నారట. ఇందుకు తగ్గట్టు ‘దమ్ము’ సినిమాలో సుమన్ పిక్ సరిగ్గా సరిపోయింది. ప్రస్తుతం ఈ ‘బెస్ట్ క్వారంటైన్’ అవార్డ్ పిక్ బాగా వైరల్ అవుతోంది.