MAA Elections Results 2021 : ‘మా’ ఓటమి గురించి దుర్గమ్మకైనా తెలుసో, లేదో..
‘మా’ ఎన్నికల ఫలితాల గురించి విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు..

MAA Elections Results 2021: ఈ ఏడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలు ఎంత సస్పెన్స్‌గా జరిగాయో తెలిసిందే. అధ్యక్ష పదవికి మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య పోటా పోటీ వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానల్ వాళ్లు మూకుమ్మడిగా రాజీనామా చెయ్యడం తెలిసిందే.
అయితే ఆదివారం రాత్రి అనసూయ గెలిచిందని చెప్పి సోమవారానికి ఓడిపోయినట్లు ప్రకటించడం, వెటకారంగా అనసూయ వరుసగా ట్వీట్స్ వెయ్యడం వైరల్ అయ్యింది. రీసెంట్‌గా ఈ వ్యవహారం గురించి నటి హేమ స్పందించారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు హేమ.
Manchu Vishnu : చిరంజీవిని కలిసేందుకు వెళ్తున్నా- విష్ణు
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ దసరా శరన్నవరాత్రులప్పుడు అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది.. దసరా టైంలో ప్రతి ఏడాది అమ్మవారిని దర్శించుకుంటాను.. ‘మా’ ఎన్నికల్లో రాత్రి గెలిచి, ఉదయానికి ఎలా ఓడిపోయామో నాకు తెలియడం లేదు.. దానికి కారణం దుర్గమ్మకైనా తెలుసో లేదో’ అన్నారు.
Jagapathi Babu : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో జగ్గూ భాయ్ లంచ్