Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ కోసం కేవలం సౌత్ ఆడియెన్స్ మాత్రమే కాకుండా నార్త్‌లోనూ ఈ సినిమాపై అదిరిపోయే...

Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్

Adipurush Disappoints Once Again

Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ కోసం కేవలం సౌత్ ఆడియెన్స్ మాత్రమే కాకుండా నార్త్‌లోనూ ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకడు ఓం రావుత్ తెరకెక్కిస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రామాయణం ఆధారంగా ఈ సినిమా రానుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఊరించి ఉసూరుమనిపించిన ఓంరౌత్

అయితే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ అనౌన్స్‌మెంట్, రిలీజ్ డేట్ తప్ప ఇప్పటివరకు ఈ సినిమా నుండి మరొక అప్‌డేట్ రాలేదు. దీంతో ఈ సినిమా యూనిట్‌పై ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్ కూడా గుర్రుగా ఉన్నారు. కనీసం రామాయణంకు ప్రత్యేక రోజులైన శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వంటి పండగలకైనా ఈ సినిమా నుండి ఏదో ఒక అప్‌డేట్ ఉంటుందని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తూ వచ్చారు.

Adipurush: డార్లింగ్ మేకోవర్ కష్టాలు.. వీ షేప్ బాడీ కోసం పడరాని పాట్లు!

కానీ శ్రీరామనవమి నాడు ప్రేక్షకులను నిరాశపరిచిన ఆదిపురుష్ టీమ్, తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా కూడా సైలెంట్‌గా ఉండి మరోసారి ప్రేక్షకులను ఉసూరుమనిపించారు. ఇక ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ పర్ఫార్మెన్స్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆశగా చూస్తున్నారు. మరి ఆదిపురుష్ చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.