Adipurush: ఆదిపురుష్ పోస్టర్ తమ పోస్టర్ నుంచి కాపీ చేశారంటూ.. ప్రముఖ యానిమేషన్ స్టూడియో ప్రకటన!

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మైథలాజికల్ మూవీ "ఆదిపురుష్". దసరా కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టీజర్ ను చిత్ర యూనిట్ అయోధ్య వేదికగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీజర్ చూసిన ప్రేక్షకులు కార్టూన్ బొమ్మలు లా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఒక ప్రముఖ యానిమేషన్ సంస్థ.. ఆదిపురుష్ ఫస్ట్ లుక్ పోస్టర్, తమ లార్డ్ శివ పోస్టర్ కు కాపీ అంటూ అధికారికంగా ప్రకటించింది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

Adipurush: ఆదిపురుష్ పోస్టర్ తమ పోస్టర్ నుంచి కాపీ చేశారంటూ.. ప్రముఖ యానిమేషన్ స్టూడియో ప్రకటన!

Adipurush First Look Poster Copied

Adipurush: ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మైథలాజికల్ మూవీ “ఆదిపురుష్”. దసరా కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టీజర్ ను చిత్ర యూనిట్ అయోధ్య వేదికగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీజర్ చూసిన ప్రేక్షకులు కార్టూన్ బొమ్మలు లా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు.

Adipurush : వందల కోట్లు పెట్టి ఇతిహాసాలని ఇలా చెడగొట్టకండి.. ‘ఆదిపురుష్’పై ఫైర్ అయిన శక్తిమాన్..

అలాగే టీజర్ లోని కొన్ని పాత్రలు, సన్నివేశాలు కూడా అభ్యంతకరంగా ఉన్నాయి అంటూ విమర్శలు కూడా ఎదురుకుంటుంది ఈ చిత్రం. ఇప్పుడు తాజాగా ఒక ప్రముఖ యానిమేషన్ సంస్థ.. ఆదిపురుష్ ఫస్ట్ లుక్ పోస్టర్, తమ లార్డ్ శివ పోస్టర్ కు కాపీ అంటూ అధికారికంగా ప్రకటించింది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

“వానర సేన స్టూడియోస్” అనే యానిమేటెడ్ కంపెనీ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టర్లను షేర్ చేస్తూ.. “ఆదిపురుష్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని తమ శివుడు పోస్టర్ నుండి మేకర్స్ స్ఫూర్తిగా తీసుకున్నట్లు కనిపిస్తోంది, కానీ దాని సృష్టికర్త అయిన ‘వానర సేన’ గురించి ప్రస్తావించకపోవడం టి-సిరీస్ కి అవమానకరం” అంటూ కామెంట్ చేసింది.

Image