Adipurush : శ్రీరామనవమికి ఆదిపురుష్ కొత్త టీజర్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మైథిలాజికల్ డ్రామా 'ఆదిపురుష్'. గత ఏడాది దసరాకి రిలీజ్ చేసిన టీజర్ లోని గ్రాఫిక్స్ బాగోలేదు అంటూ భారీగా ట్రోలింగ్ కి గురైంది. తాజాగా వచ్చే నెల శ్రీరామనవమి పండుగ...

Adipurush : శ్రీరామనవమికి ఆదిపురుష్ కొత్త టీజర్?

Adipurush

Adipurush : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మైథిలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. హిందూ పురాణం రామాయణం ఆధారంగా వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. బాలీవుడ్ యాక్టర్స్ కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. 2021లోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దాదాపు ఏడాదిన్నర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటూనే ఉంది. ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ గత ఏడాది దసరాకి రిలీజ్ చేసిన టీజర్ లోని గ్రాఫిక్స్ బాగోలేదు అంటూ భారీగా ట్రోలింగ్ కి గురైంది.

Prabhas : ఈ సంవత్సరం ప్రభాస్ మూడు సినిమాలు రిలీజ్ చేస్తాడా??

అంతేకాదు టీజర్ లోని కొన్ని పాత్రల వస్త్రధారణ హిందూ ధర్మాన్ని కించపరిచేలా ఉంది అంటూ కొన్ని హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, మూవీ టీం రిలీజ్ ని వాయిదా వేసుకుంది. తమ తప్పులను సరిదిద్దుకొని బెటర్ అవుట్ ఫుట్ తో ఈ ఏడాది జూన్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాము అంటూ చిత్ర యూనిట్ తెలియజేసింది. కాగా ఈ మూవీ గురించి ఇప్పుడు ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. వచ్చే నెల శ్రీరామనవమి పండుగ ఉండడంతో.. మూవీకి సంబంధించిన కొత్త టీజర్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ ఆలోచిస్తున్నారని సమాచారం.

మొదటి టీజర్ తో సినిమా పై అభిమానుల్లో ఉన్న అంచనాలు అందుకోకపోవడంతో, ప్రేక్షకుల్లో మూవీ పై ఆసక్తి పోయింది. దీంతో చిత్ర యూనిట్ మళ్ళీ ప్రేక్షకుల నమ్మకాన్ని, సినిమా పై ఆసక్తిని పొందేందుకు ఈ టీజర్ తో ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఏప్రిల్ నెల నుంచి వరుస ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు. సన్నీ సింగ్ లక్ష్మణుడు పాత్ర, దేవదత్త నాగే హనుమంతుడి పాత్ర పోషిస్తున్నారు.