Adipurush: సంక్రాంతి వద్దనుకున్న ఆదిపురుష్.. అయినా ఇబ్బంది తప్పట్లేదుగా!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తన్న తాజా చిత్రం ‘ఆదిపురుష్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చూసిన చిత్ర యూనిట్, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్‌ను కూడా వాయిదా వేయాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Adipurush: సంక్రాంతి వద్దనుకున్న ఆదిపురుష్.. అయినా ఇబ్బంది తప్పట్లేదుగా!

Adipurush To Have Troubel With PS-2

Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తన్న తాజా చిత్రం ‘ఆదిపురుష్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా టీజర్‌ను దసరా కానుకగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే ఈ టీజర్‌కు నెగెటివ్ రెస్పాన్స్ ఎక్కువగా రావడంతో ఈ సినిమా యూనిట్ పునరాలోచనలో పడిందట. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చూసిన చిత్ర యూనిట్, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్‌ను కూడా వాయిదా వేయాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Adipurush: ఒక్క అప్డేట్ వస్తే.. అన్నీ సైలెంట్ అవుతాయి!

అయితే ఈ సినిమాను సంక్రాంతి బరిలో నుంచి తప్పించి వేసవి కానుకగా ఏప్రిల్ 28న రిలీజ్ చేసేందుకు ఆదిపురుష్ టీమ్ ప్లాన్ చేస్తోంది. కాగా, ఈ సినిమాలో కొన్ని మార్పులు చేసి, గ్రాఫిక్స్‌ను మరింత పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దాలని ఆదిపురుష్ టీమ్ భావిస్తోందట. సంక్రాంతి బరిలో అయితే పలు సినిమాలు పోటీలో ఉన్నందున ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని వారు భావిస్తున్నారు. కానీ, ఈ సినిమాకు వేసవిలో కూడా అనుకోని పోటీ ఎదురుకానుంది.

Adipurush : సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ప్రభాస్.. ఆదిపురుష్ పోస్ట్‌పోన్.. ఎందుకో??

తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మూవీ పొన్నియిన్ సెల్వన్-1 ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమాను రెండో భాగాన్ని వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు మణిరత్నం ప్లాన్ చేస్తున్నాడట. ఈ లెక్కన ఆదిపురుష్ సమ్మర్ ఆశలపై కూడా నీళ్లు జల్లేందుకు పిఎస్-2 సినిమా రాబోతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఆదిపురుష్ సినిమా తన రిలీజ్ డేట్‌ను ఎప్పటికి లాక్ చేస్తుందో చూడాలి.