తల్లిదండ్రులతో ఆరాధ్య మెస్మరైజింగ్ డ్యాన్స్

తల్లిదండ్రులతో ఆరాధ్య మెస్మరైజింగ్ డ్యాన్స్

Aishwarya Rai

Aaradhya : కోట్లాది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెల‌చుకున్న బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్ తన గారాల కూతురు ఆరాధ్య బచ్చన్ తో కలిసి డ్యాన్స్ చేశారు. వీరితో పాటు అభిషేక్ బచ్చన్ కూడా జత కలిపారు. ఈ వీడియోను ఐశ్వర్య సోషల్ మీడియాలో పోస్టు చేశారు. క్షణాల్లో..ఈ వీడియో వైరల్ అవుతోంది. గతంలో ఎలా డ్యాన్స్ చేశారో..అదే విధంగా..స్టెప్పులు వేశారు ఐశ్వర్య. బాలీవుడ్‌ సెలిబ్రిటీ జోడిల్లో ఐశ్వర్యరాయ్‌ – అభిషేక్‌ బచ్చన్‌లు ఒకరు. వీరి గారాలపట్టి ఆరాధ్య బచ్చన్ గురించి పెద్దగా చెప్పాల్సినవసరం లేదు.

ఎక్కడ వెళితే..అక్కడ తల్లి వెంట కనిపిస్తూ ఉంటుంది. ఐశ్వర్య బంధువు పెళ్లికి అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ లు తమ కూతురితో సహా హాజరయ్యారు. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. స్టేజీపై అభిషేక్, ఐశ్వర్యతో పాటు ఆరాధ్య ఉండగా..ప్రియాంక చోప్రా నటించిన దేశీ గర్ల్ పాట ప్లే అవుతోంది. వీరు ముగ్గురూ కలిసి స్టెప్పులేశారు. తల్లిదండ్రులతో కలిసి ఆరాధ్య ఎంతో ప్రొఫెషనల్ గా డ్యాన్స్ చేయడం విశేషం. పెళ్లికి హాజరైన వారందరూ..తమ తమ సెల్ ఫోన్ లలో రికార్డు చేశారు. డ్యాన్స్ ఫ్లోర్ పై ఆరాధ్య బాగా డ్యాన్స్ చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Rai Team?? (@aishwarya_raifan)