Ajith : పాకిస్థాన్ ఇండియా బోర్డర్ వద్ద హీరో అజిత్

'వాలిమై' చిత్రంలో అజిత్ బైక్ రైడర్ గా బైక్ స్టంట్స్ బాగా చేసినట్టు సమాచారం. ఇప్పటికే విడుదల అయిన టీజర్ లో కూడా బైక్ స్టంట్స్ బాగా చూపించారు. 'వాలిమై' సినిమా చిత్రీకరణ సమయంలో కూడా

10TV Telugu News

Ajith :  త‌మిళ స్టార్ హీరో తల అజిత్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇప్పటికే అజిత్ నుంచి సినిమా వచ్చి రెండు సంవత్సరాలు అయిపొయింది. అభిమానులు అజిత్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలో అజిత్ నటించిన ‘వాలిమై’ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో బైక్ రైడర్ గా అజిత్ కనిపించబోతున్నట్టు సమాచారం. ఇందులో మన తెలుగు హీరో కార్తికేయ విలన్ గా చేస్తున్నాడు. ఈ సినిమా దీపావళికి విడుదల చేయాలని అనుకున్నా వచ్చే సంవత్సరానికి వాయిదా వేశారు.

Radhe shyam Teaser : నాకు అన్ని తెలుసు.. కానీ నేను దేవుడ్ని కాదు.. విడుదలయిన రాధేశ్యామ్ టీజర్

‘వాలిమై’ చిత్రంలో అజిత్ బైక్ రైడర్ గా బైక్ స్టంట్స్ బాగా చేసినట్టు సమాచారం. ఇప్పటికే విడుదల అయిన టీజర్ లో కూడా బైక్ స్టంట్స్ బాగా చూపించారు. ‘వాలిమై’ సినిమా చిత్రీకరణ సమయంలో కూడా చెన్నై నుండి హైదరాబాద్ కు అజిత్ బైక్ రైడ్ చేశారు. అజిత్ బైక్ రైడింగ్‌ని చాలా ఇష్ట‌ప‌డ‌తాడు. అప్పుడప్పుడు బైక్ పై లాంగ్ డ్రైవ్స్ చేస్తూ ఉంటాడు అజిత్. తాజాగా అజిత్ బైక్ పై పాకిస్థాన్ ఇండియా సరిహద్దు వాఘా వద్దకు వెళ్ళాడు. వాఘా సరిహద్దు ద‌గ్గ‌ర‌ నిల్చుని మూడు రంగుల జెండా పట్టుకుని ఫొటోలకు ఫోజు ఇచ్చాడు. ప్ర‌స్తుతం వాఘా సరిహద్దు దగ్గర దిగిన అజిత్ ఫొటో సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతుంది.