Akhanda : కుంభకోణంలో ‘అఖండ’ క్లైమాక్స్..

తమిళనాడులోని ఓ దేవాలయంలో ఈ సినిమా క్లైమాక్స్‌ ఫైట్‌ సీన్‌ను చిత్రీకరిస్తున్నారు..

Akhanda : కుంభకోణంలో ‘అఖండ’ క్లైమాక్స్..

Akhanda

Akhanda: ‘సింహా’, ‘లెజెండ్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాల తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘అఖండ’. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన రెండు చిత్రాలు సూపర్‌ హిట్‌గా నిలవడంతో వీరి క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘అఖండ’ పై ఇటు ప్రేక్షకుల్లోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ‘అఖండ’ ఫస్ట్ రోర్ టీజర్‌కు వ్యూయర్స్‌ నుంచి వస్తున్న స్పందన ఈ అంచనాలను నెక్స్ట్ లెవల్‌కి తీసుకుని వెళ్లింది.

Akhanda : బాలయ్య బర్త్‌డే ట్రీట్ వచ్చేసింది.. అల్ట్రా స్టైలిష్ లుక్‌లో ‘అఖండ’..

ఈ సినిమా తాజా షెడ్యూల్‌ తమిళనాడులో ప్రారంభమైంది. తమిళనాడులోని ఓ దేవాలయంలో ఈ సినిమా క్లైమాక్స్‌ ఫైట్‌ సీన్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ షూట్‌లో బాలకృష్ణ స‌హా సినిమాలోని ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు. ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ స్టంట్‌ శివ ఈ ఫైట్‌ సీన్‌ను డిజైన్‌ చేశారు. ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఈ సినిమాలో మరో హైలైట్‌గా నిలవనుంది.

Balakrishna : ‘అఖండ’ ఆన్ ది వే..

‘అఖండ’ సినిమాను ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్ మీద మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషిస్తుండగా.. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సి. రామ్‌ ప్రసాద్‌ కెమెరామెన్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌‌గా వర్క్ చేస్తున్నారు.