Akhanda Review: అఘోరాగా ఉగ్రరూపం.. ఊర మాస్ బాలయ్య.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

బాలయ్య నుంచి ఫుల్ మాస్ మూవీ వస్తే ఎలా ఉంటుందో మన అందరికి తెలిసిందే. ఇక బాలయ్య మాస్ కి బోయపాటి తోడైతే ఆ కాంబినేషన్ వేరే లెవెల్. ఈ కాంబినేషన్ 'అఖండ'తో....

Akhanda Review: అఘోరాగా ఉగ్రరూపం.. ఊర మాస్ బాలయ్య.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

Akhanda

Akhanda Review:  న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా ‘అఖండ’. ఇవాళ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. బాలయ్య నుంచి ఫుల్ మాస్ మూవీ వస్తే ఎలా ఉంటుందో మన అందరికి తెలిసిందే. ఇక బాలయ్య మాస్‌కి బోయపాటి తోడైతే వారి కాంబినేషన్ వేరే లెవెల్. ఈ కాంబినేషన్ ‘అఖండ’తో హ్యాట్రిక్ కొట్టిసినట్టే అంటున్నారు ప్రేక్షకులు.

Sirivennela : స్వర్గంలో కలుద్దాం.. త్వరలో నేనూ వస్తా.. ఆర్జీవీ ట్వీట్

ఇటీవల విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో ‘అఖండ’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఫస్ట్ డేనే ఈ మూవీ చూడాలని అభిమానులు, ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమా బెనిఫిట్ షోలు పడటంతో సినిమాని చుసిన అభిమానులు, ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.

Ajith : ఇకపై నన్ను ‘తల’ అని పిలవకండి : అజిత్

ఫస్టాఫ్‌ చాలా బాగుందని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. సెకండాఫ్‌ అయితే మాస్‌ ఎలిమెంట్స్‌ తో సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లారని చెబుతున్నారు. తమన్‌ ఎప్పటిలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా కొట్టాడు అంటున్నారు. ట్రైలర్ లోనే చాలా డైలాగ్స్ వినిపించారు. ఇక సినిమాలో వాటికి మించిన డైలాగ్స్ ఉన్నాయని అంటున్నారు. ఇక అఘోరాగా బాలయ్య తన పర్ఫార్మెన్స్ ని అదరగొట్టారని చెప్తున్నారు. ఎప్పుడూ లేనంత మాస్ ఎలివేషన్స్ తో ఈ సినిమా ఉందని అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. బాలయ్య ఇంట్రో, పోలీస్ స్టేషన్ ఫైట్, ఇంటర్వెల్ బ్యాంగ్, అఘోరాగా బాలయ్య నటన సినిమాకే హైలెట్ అంటున్నారు. బాలయ్య చెప్పే మాస్‌ డైలాగ్స్‌కి థియేటర్లలో ఫ్యాన్స్‌ ఈళలు వేయడం ఆపరని ఓ నెటిజన్‌ కామెంట్‌చేశాడు. తమన్ చెప్పినట్టే సినిమా సగం సేపు ఈళలు, కేకలతో నించొని సినిమా చూసారని అభిమానులు చెప్తున్నారు. మొత్తానికి బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ కొట్టేసినట్టే అని అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు