Ala Vaikunthapurramuloo: ‘అలా’ హిందీ రీమేక్.. హీరోహీరోయిన్స్ ఎవరంటే?

అలా వైకుంఠపురంలో సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేయగా ఇప్పటికీ ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాలోని పాటలైతే దేశవ్యాప్తంగా మార్మ్రోగిపోయాయి.. ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు సైతం ఈ పాటలకు స్టెప్పులేశారు. వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా గీత ఆర్ట్స్ కు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

Ala Vaikunthapurramuloo: ‘అలా’ హిందీ రీమేక్.. హీరోహీరోయిన్స్ ఎవరంటే?

Ala Vaikunthapurramuloo

Ala Vaikunthapurramuloo: అలా వైకుంఠపురంలో సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేయగా ఇప్పటికీ ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాలోని పాటలైతే దేశవ్యాప్తంగా మార్మ్రోగిపోయాయి.. ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు సైతం ఈ పాటలకు స్టెప్పులేశారు. వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా గీత ఆర్ట్స్ కు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. జులాయితో మొదలైన బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ అలాతో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ గా మారిపోయింది.

ఇక డిజిటల్ రైట్స్ నుండి హక్కుల వరకు ఈ సినిమా మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టగా రీమేక్ రైట్స్ కోసం బాలీవుడ్ నుండి ఎన్నో సంప్రదింపులు జరిగాయి. కానీ గీతా ఆర్ట్స్ రీమేక్ హక్కులను వదులుకోలేదు. కాగా, ఇప్పుడు స్వయంగా గీత ఆర్ట్స్ బాలీవుడ్ లో రీమేక్ చేసే ప్రయత్నాలు చేస్తుందట. ఇప్పటికే అక్కడ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టగా నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తుంది.

తెలుగులో నటించిన బన్నీ-పూజాహెగ్డే జంట నటనతో పాటు కెమిస్ట్రీకి మంచి పేరురాగా బాలీవుడ్ లో హీరో హీరోయిన్స్ ఎవరవుతారని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఇప్పటికే కార్తిక్ ఆర్యన్ ను హీరోగా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక హీరోయిన్ గా కృతి సనోన్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. కృతి సనన్ ఇప్పటికే తెలుగులో పలు సినిమాలు చేయగా ప్రస్తుతం ప్రభాస్ తో ఆదిపురుష్ లో సీతపాత్రలో నటిస్తుంది. మరి ఈ జంట ఈ సినిమాకు ఎంత ప్లస్ అవుతుందో చూడాలి!