సల్లూభాయ్ సినిమాలో అలీభాయ్

దబాంగ్ 3లో అలీ..

  • Published By: sekhar ,Published On : April 20, 2019 / 10:46 AM IST
సల్లూభాయ్ సినిమాలో అలీభాయ్

దబాంగ్ 3లో అలీ..

ఆన్‌స్క్రీన్ అయినా, ఆఫ్‌స్క్రీన్ అయినా తన స్టైల్ పంచులతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటాడు కామెడీ కింగ్ అలీ.. గతకొద్ది కాలంగా సినిమాలు తగ్గించేసిన అలీ, ఈ మధ్య రాజకీయాల్లోకి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ క్రేజీ ఆఫర్ అలీని వరించింది. అదికూడా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమా కావడం విశేషం.. దబాంగ్, దబాంగ్ 2 సినిమాలతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్న సల్లూ భాయ్.. దానికి సీక్వెల్‌గా దబాంగ్ 3 చేస్తున్నాడు. సోనాక్షి సిన్హా హీరోయిన్ కాగా, ప్రభుదేవా డైరెక్ట్ చేస్తున్నాడు.

పోలీస్ ఆఫీసర్ అయిన చుల్ బుల్ పాండేకి అసిస్టెంట్‌, కానిస్టేబుల్‌గా అలీ నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్‌లో, ఖాకీ డ్రెస్‌లో ఉన్న అలీ, తన భార్య, పిల్లలతో కలిసి సల్మాన్ ఖాన్‌తో ఫోటో దిగాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దబాంగ్ 3లో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ విలన్‌గా నటించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. సల్మాన్ భారత్ మూవీ ఈద్ కానుకగా 2019 జూన్ 5 న విడుదల కానుంది.