Alia Bhatt : నేను నచ్చకపోతే నా సినిమాలు చూడకండి.. ఆలియా వ్యాఖ్యలు.. ఈ సారి బాయ్‌కాట్ అలియా..

అసలే వరుస సినిమాలు ఫ్లాప్ అవుతూ బాలీవుడ్ బాధల్లో ఉంటే రోజు రోజుకి బాయ్‌కాట్‌ బాలీవుడ్ వివాదం ముదురుతోంది. బాలీవుడ్ స్టార్స్ ని, బాలీవుడ్ సినిమాలని వరుసపెట్టి బాయ్‌కాట్‌ చేస్తున్నారు బాలీవుడ్ ప్రేక్షకులు. ఇలాంటి సమయంలో సైలెంట్ గా ఉండాల్సింది పోయి................

Alia Bhatt : నేను నచ్చకపోతే నా సినిమాలు చూడకండి.. ఆలియా వ్యాఖ్యలు.. ఈ సారి బాయ్‌కాట్ అలియా..

Alia Bhatt comment goes viral and boycott alia trend in social media

Alia Bhatt :  అసలే వరుస సినిమాలు ఫ్లాప్ అవుతూ బాలీవుడ్ బాధల్లో ఉంటే రోజు రోజుకి బాయ్‌కాట్‌ బాలీవుడ్ వివాదం ముదురుతోంది. బాలీవుడ్ స్టార్స్ ని, బాలీవుడ్ సినిమాలని వరుసపెట్టి బాయ్‌కాట్‌ చేస్తున్నారు బాలీవుడ్ ప్రేక్షకులు. ఇలాంటి సమయంలో సైలెంట్ గా ఉండాల్సింది పోయి అక్కర్లేని కామెంట్స్ చేస్తూ ఈ వివాదంలో ఇరుక్కుంటున్నారు బాలీవుడ్ యాక్టర్స్. ఇప్పటికే బాలివుడ్ సినిమాలతో పాటు, బాలీవుడ్ ని కూడా బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దీనిపై కామెంట్స్ చేసిన అమీర్ ఖాన్, కరీనా కపూర్, హృతిక్ రోషన్ లను కూడా బాయ్ కాట్ చేయాలంటూ ట్రెండ్ చేశారు. తాజాగా ఈ లిస్ట్ లోకి అలియా భట్ కూడా చేరింది.

అసలే అలియా భట్ అన్నా, వాళ్ళ ఫ్యామిలీ అన్నా బాలీవుడ్ ప్రేక్షకులకి విపరీతమైన ద్వేషం ఉంది. అనేకసార్లు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం, ప్రవర్తించడం చేయడం, ఇది కాకుండా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ విషయంలో అలియాపై, వాళ్ళ నాన్నపై చాలా మందికి కోపం ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ పై స్పందించింది అలియా.

Liger Movie : లైగర్‌లో మైక్ టైసన్‌తో విజయ్ దేవరకొండకి ఫైట్ ఉందా.. పూరి జగన్నాధ్ ఏం చెప్పాడంటే..?

అలియా మాట్లాడుతూ.. ”నేను కావాలని ఈ ఇంట్లో పుట్టాలి అనుకుంటానా, నెపో కిడ్ అయితే సినిమాలు చేయోద్దా. వాళ్ళ స్టార్ డం మొదటి సినిమా వరకే పని చేస్తుంది. తర్వాత నా పర్ఫార్మెన్స్ బట్టే ఉంటుంది. నేను ఇలాంటివి పట్టించుకోను. నా పని నేను చేసుకుంటాను. నేను నచ్చకపోతే నా సినిమాలు చూడకండి” అని వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలని వ్యతిరేకిస్తూ బాయ్ కాట్ అలియా ట్రెండ్ ని మొదలుపెట్టారు నెటిజన్లు. త్వరలో అలియా బ్రహ్మాస్త్ర సినిమా రానుండటంతో ఆ సినిమాని కూడా బాయ్ కాట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికైనా బాలీవుడ్ నటులు మారకుండా, ఇంకా ఇలాంటి కామెంట్స్ చేస్తే, ఇది ఇలాగే కంటిన్యూ అయితే బాలీవుడ్ పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది అనడంలో సందేహం లేదు.