Allu Arjun: స్టైలిష్ స్టార్ టు ఐకాన్ స్టార్.. 20 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్న అల్లు అర్జున్!
టాలీవుడ్లో స్టైలిష్ స్టార్‌గా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న హీరో అల్లు అర్జున్. ఆయన సినీ కెరీర్ నేటికి(మార్చి 28, 2023) 20 ఏళ్లు పూర్తి చేసుకుంది.
Allu Arjun: టాలీవుడ్లో స్టైలిష్ స్టార్‌గా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న హీరో అల్లు అర్జున్. ఆయన సినీ కెరీర్ నేటికి(మార్చి 28, 2023) 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. తొలి సినిమాకే బన్నీ చేసిన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆక్టటుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బన్నీ, ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.
Allu Arjun : అల్లుఅర్జున్ న్యూ లుక్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..
తన రెండో సినిమాగా దర్శకుడు సుకుమార్ డైరెక్షన్లో ‘ఆర్య’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో ప్రేమికుడిగా బన్నీకి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో తన కెరీర్‌ను జెట్ స్పీడుగా తీసుకెళ్లాడు బన్నీ. మధ్యలో కొన్ని ఫ్లాపులు వచ్చినా కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా, వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్లాడు. ఇక సుకుమార్‌తో ఆర్య, ఆర్య-2 వంటి సినిమాలు చేసిన బన్నీ, ‘పుష్ప-1’తో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో బన్నీని పూర్తిగా మాస్ హీరోగా మార్చేశాడు సుకుమార్.
పుష్ప లాంటి పాత్ర జీవితంలో ఒక్కసారి మాత్రమే పడుతుందని.. ఇలాంటి పాత్ర కోసం ఎలాంటి మేకోవర్ అయినా చేయాల్సిందే అని బన్నీ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ దక్కింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది పుష్ప. ఇక ఈ సినిమా ఇచ్చిన ట్రెమెండస్ సక్సెస్‌తో ఇప్పుడు పుష్ప-2 చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు.
Allu Arjun : అల్లు అర్హ చేసిన పనికి అల్లు అర్జున్ షాక్.. స్నేహారెడ్డి పోస్ట్ చూశారా?
స్టైలిష్ స్టార్‌గా ముద్ర వేసుకున్న బన్నీ, పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు. యూత్ ఐకాన్‌గా బన్నీ తనను తాను మలుచుకున్న తీరు అద్భుతం అని ఆయన అభిమానులు అంటున్నారు. స్టైల్‌కు కేరాఫ్‌గా ఉండే బన్నీ, తన 20 ఏళ్ల సినీ కెరీర్లో తనను ఎంతో ఆదరించి, అభిమానించిన ప్రేక్షకులకు, తన శ్రేయోభిలాషులకు, తన ఫ్యాన్స్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు.
Today, I complete 20 years in the film industry. I am extremely blessed & have been showered with love . I am grateful to all my people from the industry . I am what I am bcoz of the love of the audience, admirers & fans . Gratitude forever 🙏🏽
— Allu Arjun (@alluarjun) March 28, 2023