బన్నీతో ఉన్న బామ్మగారు ఎవరో తెలుసా?

కరోనా ఎఫెక్ట్ : కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న అల్లు అర్జున్..

  • Published By: sekhar ,Published On : March 20, 2020 / 04:02 PM IST
బన్నీతో ఉన్న బామ్మగారు ఎవరో తెలుసా?

కరోనా ఎఫెక్ట్ : కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న అల్లు అర్జున్..

గతకొద్ది రోజులుగా కరోనా వైరస్ (కోవిడ్ -19)  ప్రపంచాన్ని గజగజ వణికిస్తుంది. ఈ వైరస్ భారత్‌ను కూడా భయపెడుతోంది. ఇప్పటికే స్కూల్స్, కాలేజీలు, థియేటర్లు, సినిమా, టెలివిజన్ షూటింగులు, పార్కులు, పబ్బులు, బార్లు, రవాణా సదుపాయాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి.

సెలబ్రిటీలంతా హోమ్ క్వారంటైన్‌కే పరిమితమైపోయారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తన నానమ్మతో ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న హ్యాట్రిక్ ఫిల్మ్ షూటింగులో అల్లు అబ్బాయి ఇప్పటికే  జాయిన్ కావాల్సింది. కరోనా కారణంగా కేరళ షెడ్యూల్ వాయిదా పడింది.

ఇటీవలే చిత్తూరు యాసకు సంబంధించి క్లాసెస్ తీసుకుంటున్న బన్నీ.. కుటుంబ సభ్యులతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. తాత స్వర్గీయ అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు కనకరత్నం గారితో సరాదాగా గడుపుతున్న ఫోటోకు ‘ప్రియమైన వారితో క్వారంటైన్ లైఫ్.. మంచి అనుభూతి’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు అర్జున్. ఈ ఫోటోను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. సుకుమార్ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్, స్టైలిష్ బిజినెస్‌మెన్‌గా ద్విపాత్రాభినయం చేయనున్నాడని సమాచారం.