jagan biopic : ఏపీ సీఎం జగన్ పాత్రలో అల్లు అర్జున్!

  • Published By: madhu ,Published On : July 19, 2020 / 10:33 AM IST
jagan biopic : ఏపీ సీఎం జగన్ పాత్రలో అల్లు అర్జున్!

‘పుష్ప’ తర్వాత మరో ప్యాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడు ‘అల్లు అర్జున్’. మహి వి రాఘవ్‌తో ఓ సినిమా చేయబోతున్న అల్లు వారబ్బాయి… సింగిల్ సిట్టింగ్‌లోనే కథను ఫైనల్ చేసాడట. త్వరలోనే దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది. అయితే.. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్‌గా ఉండబోతుందని.. అల్లు అర్జున్ ఏపీ సీఎం జగన్‌ పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తోంది.

దీంతో ఈ చిత్రం ‘జగన్ బయోపిక్’ అని ప్రచారం జరుగుతోంది. అప్పటివరకు తన ప్రపంచంలో ఉన్న ఓ కుర్రాడు.. ముఖ్యమంత్రి అయిన తన తండ్రి చనిపోతే వచ్చి ఆ తర్వాత ఎలా రాజకీయాలను శాసించాడు అనేది సినిమా కథగా తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత…సీఎంగా గెలిచేంత వరకు జరిగిన ఘటలను సినిమాలో చూపించనున్నారని తెలుస్తోంది. ఈ వార్త తెలియగానే అటు జగన్ ఫ్యాన్స్, ఇటు బన్నీ అభిమానులు ఫుల్ ఖుష్ అయితున్నారు. కానీ ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా షూటింగ్ లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో దర్శక, నిర్మాతలు, నటులు ఇంటికే పరిమితమయ్యారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాతే..ఈ మూవీకి సంబంధించిన ఓ ప్రకటన వస్తుందని అనుకుంటున్నారు.