Allu Arjun : బన్నీని మరొకరి ప్రేమలో పడేలా చేసిన స్నేహారెడ్డి.. ఎవరి ప్రేమలో పడ్డాడో తెలుసా?

అల్లు అర్జున్, స్నేహరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని అందరికి తెలిసిన విషయమే. అయితే స్నేహారెడ్డి ఇప్పుడు బన్నీని మరొకరి ప్రేమలో పడేలా చేసింది. అది ఎవరి ప్రేమలో అంటే..

Allu Arjun : బన్నీని మరొకరి ప్రేమలో పడేలా చేసిన స్నేహారెడ్డి.. ఎవరి ప్రేమలో పడ్డాడో తెలుసా?

Allu Sneha Reddy make Allu Arjun to fall love with nature

Allu Arjun – Sneha Reddy : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని అందరికి తెలిసిన విషయమే. టాలీవుడ్ లో వీరిద్దర్నీ లవ్లీ కపుల్ అంటుంటారు అందరూ. ఇక మన బన్నీని తన ప్రేమలో పడేసుకున్న స్నేహారెడ్డి.. ఇప్పుడు బన్నీ మరో ప్రేమలో పడేలా చేస్తుంది. స్నేహారెడ్డి ప్రకృతి ప్రేమికురాలు. ఈ ప్రేమతోనే ఆమె నర్సరీ కూడా మెయిన్‌టైన్ చేస్తూ వస్తుంది. ఇక అప్పుడప్పుడు ఆ నర్సరీకి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంటుంది.

Telugu Indian Idol 2 : విశాఖ అమ్మాయి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 విజేత

మన చుట్టూ మొక్కలు పెంచడంలో ఎంతో హ్యాపినెస్ ఉంటుంది. వాటితో మాట్లాడుతుంటే, చుట్టూ పచ్చదనం కనిపిస్తుంటే అంతకు మించిన స్వర్గం లేదని చెప్పుకొస్తుంటుంది. ఇక తనతో పాటు బన్నీని కూడా ఆ ప్రకృతి ప్రేమలో పడేసింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం కావడంతో విషెస్ తెలియజేస్తూ ఒక పోస్ట్ షేర్ చేశాడు. అందులో అల్లు అర్జున్ మొక్క నాటి దానికి నీళ్లు పోస్తూ కనబడుతున్నాడు. అలాగే దానికి ఇలా రాసుకొచ్చాడు.. “మనం చేయగలిగిన విధంగా మన చిన్న పనిని మనం చేద్దాం” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Allu Arjun : తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2 విన్నర్ పై బన్నీ ఎమోషనల్ కామెంట్స్..

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప 2 (Pushpa 2) సినిమాలో నటిస్తున్నాడు. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా వైడ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ మూవీ పై మరింత అంచనాలు పెంచేసింది. రక్ష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) విలన్ గా కనిపించబోతున్నాడు. జగపతిబాబు, సునీల్, అనసూయ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Allu Sneha Reddy make Allu Arjun to fall love with nature

Allu Sneha Reddy make Allu Arjun to fall love with nature