Ananya Nagalla: పెళ్లికొడుకును చూసినందుకు థ్యాంక్స్ చెబుతున్న అనన్య

టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఓ నిర్మాత కొడుకుతో అనన్య పెళ్లి ఫిక్స్ అయ్యిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో, దీనిపై ఆమె తాజాగా స్పందించింది.

Ananya Nagalla: పెళ్లికొడుకును చూసినందుకు థ్యాంక్స్ చెబుతున్న అనన్య

Ananya Nagalla Thrashes On Her Marriage Rumours

Ananya Nagalla: టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఆ తరువాత పలు సినిమాలు చేసినా, పెద్దగా వర్కవుట్ మాత్రం కాలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రంలో నటించి ఆడియెన్స్ చూపును తనవైపుకు తిప్పుకుంది ఈ బ్యూటీ. ఇక అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ మాత్రం మరో లెవెల్‌లో ఉండటం విశేషం.

Ananya Nagalla: నడుము అందాలతో నలిపేస్తున్న అనన్య నాగళ్ల

హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాలో అనన్య చేసే హంగామా అంతా ఇంతా కాదు. తాజాగా అమ్మడు నడము అందాలను ఒలకబోస్తూ చేసిన ఫోటోషూట్ బాగా వైరల్ అవుతోంది. అయితే ఈ బ్యూటీకి సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఓ నిర్మాత కొడుకుతో అనన్య పెళ్లి ఫిక్స్ అయ్యిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో, దీనిపై ఆమె తాజాగా స్పందించింది.

Ananya Nagalla: నలుపు చీరలో అనన్య నాగళ్ల పరువాల విందు

తనకు పెళ్లికొడుకును చూసినందుకు అందరికీ థ్యాంక్స్.. ఇక పెళ్లి ఎప్పుడు, ఎక్కడో కూడా చెబితే తన పెళ్లికి తాను వస్తానంటూ వ్యంగ్యంగా కామెంట్ చేసింది ఈ బ్యూటీ. దీంతో తన పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ కూడా కేవలం పుకార్లేనని ఇలా చెప్పేసింది ఈ బ్యూటీ. ఏదేమైనా సెలబ్రిటీల పర్సనల్ విషయాలపై అభిమానులకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుందని అనన్య ఈ విధంగా కామెంట్ చేసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.