Vijay – Ananya : థ్యాంక్యూ ఆంటీ.. విజయ్ ఇంట్లో స్పెషల్ పూజలు చేసిన అనన్య పాండే.. విజయ్ తల్లికి థ్యాంక్స్ చెప్తూ పోస్ట్..

అనన్య పాండే మొదటిసారి విజ‌య్ దేవ‌ర‌కొండ ఇంటికి వెళ్లింది. అనన్యకి విజయ్ తల్లి స్వాగ‌తం ప‌లికింది. లైగర్ సినిమా హిట్ అవ్వాలని, దేశమంతా ప్రమోషన్స్ కోసం తిరుగుతున్నారు, జాగ్రత్తగా ఉండాలని విజయ్ తల్లి స్పెషల్ పూజలు............

Vijay – Ananya : థ్యాంక్యూ ఆంటీ.. విజయ్ ఇంట్లో స్పెషల్ పూజలు చేసిన అనన్య పాండే.. విజయ్ తల్లికి థ్యాంక్స్ చెప్తూ పోస్ట్..
ad

Vijay – Ananya :  విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా లైగర్. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకి రానుంది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుండటంతో చిత్ర యూనిట్ ఇండియా అంతా పీక్స్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. అయితే తాజాగా అనన్య పాండేని విజయ్ హైదరాబాద్ లోని తన ఇంటికి తీసుకెళ్లాడు.

అనన్య పాండే మొదటిసారి విజ‌య్ దేవ‌ర‌కొండ ఇంటికి వెళ్లింది. అనన్యకి విజయ్ తల్లి స్వాగ‌తం ప‌లికింది. లైగర్ సినిమా హిట్ అవ్వాలని, దేశమంతా ప్రమోషన్స్ కోసం తిరుగుతున్నారు, జాగ్రత్తగా ఉండాలని విజయ్ తల్లి స్పెషల్ పూజలు చేసింది. పూజలు చేసి విజయ్, అనన్య చేతులకి తాళ్లు కట్టింది. వారిద్దర్నీ ఆశీర్వదించి, పంతులు గారితో కూడా ఆశీర్వచనాలు అందించారు విజయ్ తల్లి. దీంతో అనన్య చాలా హ్యాపీగా ఫీల్ అయింది.

#Boycott VikramVeda : నీ పని నువ్వు చూసుకో.. నీ సినిమా కూడా బాయ్ కాట్ చేస్తాం.. హృతిక్ కి నెటిజన్లు వార్నింగ్..

ఈ ఫోటోలని అనన్య తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి థ్యాంక్యూ ఆంటీ, విజయ్ ఇంట్లో స్పెషల్ పూజలు చేశాం అంటూ పోస్ట్ చేసింది. ఇక ఇవే ఫోటోలని విజయ్ దేవరకొండ షేర్ చేసి.. దేశమంతా తిరుగుతున్నాను, మా జాగ్రత్త కోసం అమ్మ పూజలు చేపించి రక్షణ తాళ్లు కట్టింది చేతికి అని పోస్ట్ చేశాడు. దీంతో వీరు పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.