Anil Ravipudi : భగవంత్ కేసరి సీక్వెల్ పై స్పందించిన అనిల్ రావిపూడి.. ఏమన్నాడంటే?
మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని భగవంత్ కేసరి సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది.

Anil Ravipudi Comments on Balakrishna Bhagavanth Kesari Sequel Movie
Anil Ravipudi : బాలకృష్ణ (Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా అక్టోబర్ 19న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) నటించగా శ్రీలీల(Sreeleela) బాలయ్య బాబుకి కూతురి పాత్రలో నటించి మెప్పించింది. బాలయ్య నుంచి వచ్చే రెగ్యులర్ యాక్షన్ మూవీ, అనిల్ రావిపూడి నుంచి వచ్చే రెగ్యులర్ కామెడీ కమర్షియల్ మూవీ కాకుండా బిన్నంగా ఎమోషన్స్, మెసేజ్ లతో భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకులని మెప్పించింది.
దీంతో మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని భగవంత్ కేసరి సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. ఈ సినిమాతో కూడా 100 కోట్లు కలెక్ట్ చేసి హ్యాట్రిక్ 100 కోట్ల సినిమా సాధించనున్నారు బాలయ్య. తాజాగా ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ నిర్వహించగా చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు.
Also Read : Suma Kanakala : నేను సడెన్ గా చనిపోతే ఏ ఇన్స్యూరెన్స్, ఎంతొస్తుంది.. అన్నీ మా పిల్లలకు చెప్పాను..
భగవంత్ కేసరి సక్సెస్ ఈవెంట్ లో అనిల్ రావిపూడి సినిమా సక్సెస్ గురించి మాట్లాడిన అనంతరం సినిమా సీక్వెల్ పై స్పందించాడు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తీసే ధైర్యం నాకు లేదు. ఈ బరువు మోసినందుకే ఇన్నాళ్లు నేను చాలా నలిగిపోయాను. సీక్వెల్ తీయగలిగే శక్తిని బాలకృష్ణ గారు నాకిస్తే, వెనకాల నేను ఉన్నాను అంటే వెంటనే సీక్వెల్ తీస్తాను అని తెలిపారు. ఇక ఈ సినిమా మహిళా శక్తి గురించి, చిన్నపిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్తూ మంచి మెసేజ్ ఇవ్వడంతో జనాల్లోకి మరింత రీచ్ అవుతుంది.