Ante Sundaraniki: అంటే సుందరానికీ… ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘‘అంటే సుందరానికీ’’ మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేస్తూ వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు వివేక్....

Ante Sundaraniki: అంటే సుందరానికీ… ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?

Ante Sundaraniki 3 Days Worldwide Collections

Ante Sundaraniki: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘‘అంటే సుందరానికీ’’ మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేస్తూ వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ ప్యూర్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని కనబరిచారు. ఇక ఈ సినిమాను జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాలు మధ్య రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండనుండటంతో ఈ సినిమాను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Ante Sundaraniki: అంటే సుందరానికీ.. తొలిరోజు ఎంత కొల్లగొట్టాడంటే?

అటు నజ్రియా నాజిమ్‌తో నాని కెమిస్ట్రీ కూడా సూపర్బ్‌గా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఇంట్రెస్ట్‌ను చూపిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి మూడు రోజులు పూర్తయ్యేసరికి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి కలెక్షన్స్‌ను వసూలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.14.95 కోట్ల షేర్ వసూళ్లు సాధించి నాని కెరీర్‌లో మరో హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో నాని సరికొత్త లుక్‌లో కనిపించడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Ante Sundaraniki: అంటే సుందరానికీ సక్సెస్ సెలబ్రేషన్స్.. ఫోటోలు

కాగా.. ఈ సినిమాకు అసలు పరీక్ష సోమవారం నుండి ఉండనుంది. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ సంగీతం అందించగా, సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేయగా, ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.30 కోట్లకు అమ్ముడయ్యాయి. మరి టోటల్ రన్‌లో ఈ సినిమా ఎంతమేర వసూళ్లు సాధిస్తుందో తెలియాలంటూ మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 4.54 కోట్లు
సీడెడ్ – 1.07 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.15 కోట్లు
ఈస్ట్ – 0.84 కోట్లు
వెస్ట్ – 0.73 కోట్లు
గుంటూరు – 0.80 కోట్లు
కృష్ణా – 0.74 కోట్లు
నెల్లూరు – 0.53 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.10.40 కోట్లు(రూ.17.60 కోట్ల గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 1 కోట్లు
ఓవర్సీస్ – 3.55 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ – రూ.14.95 కోట్లు (రూ.26.25 కోట్లు గ్రాస్)