Ajith: అజిత్‌తో వైరానికి దిగుతున్న వర్సెటైల్ యాక్టర్.. ఎవరంటే?

తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ఎంటర్ టైనర్ మూవీ ‘తునివు’ సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. పూర్తి యాక్షన్ కథతో వస్తున్న తునివు చిత్రాన్ని దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కించగా, ఈ సినిమాలో అజిత్ పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

Ajith: అజిత్‌తో వైరానికి దిగుతున్న వర్సెటైల్ యాక్టర్.. ఎవరంటే?

Aravind Swamy To Clash With Ajith In His Next Movie

Ajith: తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ఎంటర్ టైనర్ మూవీ ‘తునివు’ సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. పూర్తి యాక్షన్ కథతో వస్తున్న తునివు చిత్రాన్ని దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కించగా, ఈ సినిమాలో అజిత్ పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

Ajith: తెగింపు చూపిస్తోన్న అజిత్.. బరిలో ముందుగా దిగుతున్నాడుగా!

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, ట్రైలర్ ఈ మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ సినిమా తరువాత అజిత్ తన నెక్ట్స్ మూవీని డైరెక్టర్ విఘ్నేష్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. కాగా, ఈ సినిమాలో నెగెటివ్ పాత్రలో ఓ వర్సెటైల్ యాక్టర్ నటించబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అజిత్ ఈ సినిమాలోనూ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడట.

Ajith: తునివు ట్రైలర్.. యాక్షన్‌తో ఇరగ్గొట్టిన అజిత్.. మరో బ్లాక్‌బస్టర్ ఖాయం!

అయితే ఆయన్ను ఢీకొనే పాత్రలో అరవింద్ స్వామి నటించబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గతంలోనూ పలు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అరవింద్ స్వామి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఇప్పుడు అజిత్ వంటి స్టార్ హీరోను ఢీకొనే పాత్రలో అరవింద్ స్వామి నటిస్తుండటంతో, వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఎలాంటి గూస్‌బంప్స్ తెప్పిస్తాయా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.