Avatar 2 : అవతార్-2 కొత్త ట్రైలర్ వచ్చేసింది.. విజువల్ వండర్!

2009లో విడుదలైన “అవతార్” సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. ఇక ఇంతటి విజయాన్ని అందుకున్న ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుండడంతో వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడు ఆ విజువల్ వండర్ ని చూస్తామో అని ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించి ఒక ట్రైలర్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. విడుదల దగ్గర పడడంతో, నేడు మరో కొత్త ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.

Avatar 2 : అవతార్-2 కొత్త ట్రైలర్ వచ్చేసింది.. విజువల్ వండర్!

Avatar 2 new trailer release

Avatar 2 : 2009లో విడుదలైన “అవతార్” సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. ప్రముఖ హాలీవుడ్ దర్శకనిర్మాత జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్.. అప్పట్లో హిందీ, తెలుగు మరియు ఇతర ఇండియన్ డబ్బింగ్ వెర్షన్‌ లో రికార్డు స్థాయిల్లో రిలీజ్ అవ్వడమే కాదు, అంతకుమించిన కలెక్షన్స్ ని అందుకుని ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ఆశ్చర్యపోయేలా చేసింది.

Avatar 2: అవతార్ 2 హిట్ అయితేనే.. లేకపోతే మర్చిపోండి అంటోన్న జేమ్స్ కామెరాన్!

ఇక ఇంతటి విజయాన్ని అందుకున్న ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుండడంతో వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడు ఆ విజువల్ వండర్ ని చూస్తామో అని ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించి ఒక ట్రైలర్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. విడుదల దగ్గర పడడంతో, నేడు మరో కొత్త ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.

రెండు నిమిషాలు నిడివి ఉన్న ఈ ట్రైలర్ లోని విజువల్స్ ప్రేక్షకులను కట్టి పడేసేలా ఉన్నాయి. అవతార్-1 లో అంతరిక్ష అందాలని చూపించిన కామెరాన్, సీక్వెల్ లో సముద్ర అందాలను చూపించనున్నాడు. మొదటి భాగంలో అవతార్స్ కి పుట్టిన నెక్స్ట్ జెనరేషన్ అవతార్స్ తో ఈ సినిమా కథాంశం నడవనుంది. డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా అవతార్-2 గ్రాండ్ గా విడుదల కాబోతుంది. మరి ఈ సినిమాతో జేమ్స్ కామెరాన్ ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.