Badri: బద్రి రీ-రిలీజ్‌పై అయోమయం.. క్లారిటీ కావాలంటోన్న ఫ్యాన్స్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన పలు సినిమాలు ఇటీవల రీ-రిలీజ్ చేయగా, వాటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’ సినిమాను థియేటర్లలో భారీ ఎత్తున రీ-రిలీజ్ చేయగా, దానికి ప్రేక్షకుల నుంచి స్టన్నింగ్ రెస్పాన్స్ దక్కింది. ఇక వసూళ్ల పరంగానూ ఆ సినిమా దుమ్ములేపింది. అయితే ఇప్పుడు పవన్ నటించిన మరో సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Badri: బద్రి రీ-రిలీజ్‌పై అయోమయం.. క్లారిటీ కావాలంటోన్న ఫ్యాన్స్!

Badri Movie Re-Release Still In Dilemma

Badri: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన పలు సినిమాలు ఇటీవల రీ-రిలీజ్ చేయగా, వాటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’ సినిమాను థియేటర్లలో భారీ ఎత్తున రీ-రిలీజ్ చేయగా, దానికి ప్రేక్షకుల నుంచి స్టన్నింగ్ రెస్పాన్స్ దక్కింది. ఇక వసూళ్ల పరంగానూ ఆ సినిమా దుమ్ములేపింది. అయితే ఇప్పుడు పవన్ నటించిన మరో సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Badri Re-Release : పవన్ కళ్యాణ్ బద్రి రిలీజ్ డేట్ చేంజ్..

పవన్ కల్యాణ్, దర్శకుడు పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లో వచ్చిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘బద్రి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో పవన్ కల్యాణ్ యూత్‌లో మరింత ఫాలోయింగ్‌ను దక్కించుకున్నాడు. ఇక ఈ సినిమాలోని పాటలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాను తొలుత జనవరి 26న రీ-రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ను వాయిదా వేశారు.

Badri Re-Release: మరోసారి పవర్ చూపించేందుకు రెడీ అవుతున్న పవన్ కల్యాణ్..!

ఇక ఈ సినిమాను ఎలాగైనా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ, అది కూడా కుదరకపోవడంతో ఈ సినిమాను ఫిబ్రవరి 18న రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారట. కాగా, ఈ విషయంపై చిత్ర వర్గాల నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుతున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన అందాల భామలు రేణు దేశాయ్, అమీషా పటేల్‌లు హీరోయిన్లుగా నటించారు. రమణ గోగుల సంగీతం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.