Akhanda 2: అఖండ 2 మూవీని అప్పుడే స్టార్ట్ చేయాలని చూస్తోన్న బోయపాటి..?

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని తెలిపిన బోయపాటి శ్రీను, ఈ మూవీని స్టార్ట్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశాడట.

Akhanda 2: అఖండ 2 మూవీని అప్పుడే స్టార్ట్ చేయాలని చూస్తోన్న బోయపాటి..?

Balakrishan Akhanda 2 Movie To Get Launch At This Time

Akhanda 2: నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ మూవీ అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేయగా, పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. బోయపాటి – బాలయ్య కాంబినేషన్‌లో గతంలో సింహా, లెజెండ్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు రావడంతో, అఖండ మూవీ కూడా అదే రేంజ్‌లో హిట్ అవుతుందని అభిమానులు అంచనా వేశారు. వారు అనుకున్నట్లుగానే ఈ సినిమాను పవర్‌ఫుల్ కంటెంట్‌తో దర్శకుడు బోయపాటి తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

Akhanda: అఖండ సీక్వెల్‌లో ఈ అంశాలే కీలకం అంటోన్న బోయపాటి

ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో అఖండ-2 మూవీ ఎప్పుడెప్పుడు తెరకెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో NBK108 మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని మరోసారి బోయపాటి శ్రీనుతో చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే బాలయ్యతో అఖండ 2 చిత్రాన్ని స్టార్ట్ చేసేందుకు బోయపాటి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.

Akhanda: అఖండ సీక్వెల్‌లో ఈ అంశాలే కీలకం అంటోన్న బోయపాటి

అక్టోబర్ నెలలో అఖండ 2 చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించి, సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడట. బోయపాటి ప్రస్తుతం రామ్ పోతినేనితో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేస్తుండగా, ఈ సినిమా తరువాత అఖండ 2 మూవీని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి నిజంగానే అఖండ 2 మూవీని అక్టోబర్ నెలలో స్టార్ట్ చేస్తారా అనేది తెలియాలంటే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.