బాబు రెడీబాబు, స్టార్ట్ కెమెరా: యాక్షన్

జూన్ 10 న బాలయ్య, బోయపాటి సినిమా ప్రారంభం..

  • Published By: sekhar ,Published On : April 16, 2019 / 01:05 PM IST
బాబు రెడీబాబు, స్టార్ట్ కెమెరా: యాక్షన్

జూన్ 10 న బాలయ్య, బోయపాటి సినిమా ప్రారంభం..

నటసింహ నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ, ఒకదాన్ని మించి ఒకటి సూపర్‌హిట్ అయ్యాయి. వరస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న తనకి సింహా లాంటి హిట్ ఇచ్చిన బోయపాటి అంటే బాలయ్యకి ప్రత్యేకమైన అభిమానం.. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్‌కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత సినిమా చేద్దామనుకున్నారు కానీ, బాలయ్య పైసా వసూల్, జైసింహా, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలతో, బోయపాటి జయజానకి నాయక, వినయ విధేయ రామ సినిమాలతో బిజీ అయిపోయారు.

Balakrishna-Boyapati Srinu

ఎట్టకేలకు వీరి కాంబోలో రూపొందబోయే మూడవ సినిమాకి ముహూర్తం కుదిరింది.. జూన్ 10 న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా సినిమాని ప్రారంభించబోతున్నారు. ఎన్‌బి‌కె ఫిల్మ్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై, బాలకృష్ణ నిర్మాణంలో, ప్రొడక్షన్ నెంబర్-3గా తెరకెక్కబోతుందీ సినిమా.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల ఫలితాలతో నిరాశలో ఉన్న బాలయ్యకీ, వినయ విధేయ రామ వంటి డిజాస్టర్‌తో డీలాపడ్డ బోయపాటికీ ఈ సినిమా విజయం కీలకంగా మారనుంది.