Bhagavanth Kesari Teaser : నేలకొండ భగవత్ కేసరి.. ఈ పేరు చాలా ఏండ్లు యాద్ ఉంటది.. బాలయ్య భగవంత్ కేసరి టీజర్ రిలీజ్..

నేడు జూన్ 10 ఉదయం 10 గంటల 19 నిమిషాలకు భగవంత్ కేసరి టీజర్ ని రిలీజ్ చేశారు. ఇది బాలయ్య 108వ సినిమా కావడంతో 108 థియేటర్స్ లో ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.

Bhagavanth Kesari Teaser : నేలకొండ భగవత్ కేసరి.. ఈ పేరు చాలా ఏండ్లు యాద్ ఉంటది.. బాలయ్య భగవంత్ కేసరి టీజర్ రిలీజ్..

Balakrishna Bhagavanth Kesari Movie Teaser Released

Bhagavanth Kesari : అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో బాలయ్య(Balayya) బాబు చేస్తున్న NBK108 సినిమాకు ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ని ప్రకటించి బాలయ్య పుట్టినరోజు ముందే అభిమానులలో ఫుల్ జోష్ ని నింపారు చిత్రయూనిట్. జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు ఉండటంతో భగవంత్ కేసరి సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇస్తామని ప్రకటించారు చిత్రయూనిట్.

Bhagavanth Kesari Teaser : ‘భగవంత్ కేసరి’ టీజర్‌‌కి మొత్తం రెడీ.. ఫ్యాన్స్‌కి సూపర్ సర్‌ప్రైజ్ అంటున్న అనిల్, తమన్.. 108 థియేటర్స్ లో..

నేడు జూన్ 10 ఉదయం 10 గంటల 19 నిమిషాలకు భగవంత్ కేసరి టీజర్ ని రిలీజ్ చేశారు. ఇది బాలయ్య 108వ సినిమా కావడంతో 108 థియేటర్స్ లో ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. థియేటర్స్ లో బాలయ్య అభిమానులు సందడి చేశారు. హైదరాబాద్ శ్రీ భ్రమరాంబ థియేటర్ లో నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి టీజర్ లాంచ్ ని చిత్రయూనిట్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు, డైరెక్టర్ అనిల్ రావిపూడి పాల్గొన్నారు. బాలయ్య అభిమానులు సందడి చేశారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న భగవంత్ కేసరి సినిమాలో కాజల్ హీరోయిన్ నటిస్తుండగా శ్రీలీల, శరత్ కుమార్, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా దసరాకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమా తెలంగాణ యాసలో తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక టీజర్ రిలీజయ్యాక మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ కొడతాడని భావిస్తున్నారు.

ఇక టీజర్ ఒక నిమిషం 15 సెకండ్స్ ఉంది. బాలయ్యని మరోసారి మాస్ గా చూపించబోతున్నారు. ఈసారి తెలంగాణ మాస్ లో చూపించబోతున్నారు అనిల్. తెలంగాణ యాసలో, హిందీలో డైలాగ్స్ చెప్పి బాలయ్య అలరించారు. మాస్ BGM తో పాటు చివర్లో క్లాస్ మ్యూజిక్ కూడా ఇచ్చాడు తమన్. నేలకొండ భగవత్ కేసరి.. ఈ పేరు చాలా యేండ్లు యాద్ ఉంటది అని ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేసిండు బాలయ్య.