Bekkem Venugopal : సినిమాలు ఎక్కువయి ఓటీటీలో వేయమని అడుక్కునే స్థితిలో ఉన్నాం.. కథ కంటే కాంబినేషన్లనే ఎక్కువ నమ్ముకుంటున్నారు..

ఇంటర్వ్యూలో బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. సినిమాల్లో నిర్మాతది ఎప్పుడూ క్లిష్ట పరిస్థితే. సినిమా మీద నాలెడ్జ్ వున్న వాళ్లు, అనుభవం వున్న నిర్మాతలు తీసిన సినిమాల్లో సక్సెస్ రేట్ ఎక్కువ.

Bekkem Venugopal : సినిమాలు ఎక్కువయి ఓటీటీలో వేయమని అడుక్కునే స్థితిలో ఉన్నాం.. కథ కంటే కాంబినేషన్లనే ఎక్కువ నమ్ముకుంటున్నారు..

Bekkem Venugopal comments on present movies and OTT

Bekkem Venugopal :  టాటా బిర్లా మధ్యలో లైలా చిత్రంతో నిర్మాతగా ప్రస్థానం మొదలుపెట్టి చిన్న సినిమాలతో సక్సెస్ లు కొడుతూ మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు బెక్కెం వేణుగోపాల్. సత్యభామ, నేను లోకల్(Nenu Local), పాగల్(Pagal), ప్రేమ ఇష్క్ కాదల్, సినిమా చూపిస్తా మామ, హుషారు(Husharu).. లాంటి పలు విజయవంతమైన చిత్రాలతో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్(Bekkem Venugopal). ప్రస్తుతం పలు సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలని పంచుకున్నారు.

ఈ ఇంటర్వ్యూలో బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. సినిమాల్లో నిర్మాతది ఎప్పుడూ క్లిష్ట పరిస్థితే. సినిమా మీద నాలెడ్జ్ వున్న వాళ్లు, అనుభవం వున్న నిర్మాతలు తీసిన సినిమాల్లో సక్సెస్ రేట్ ఎక్కువ. అనుభవంతో పాటు సినిమా మీద అంకితభావం వుండాలి. అప్పుడే నిర్మాతగా సక్సెస్ సాధిస్తారు. కానీ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో సినిమా కథ కంటే కాంబినేషన్ నమ్ముకుని ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు నిర్మాతలు. అందుకే ఒకవేళ సినిమా హిట్ టాక్ వచ్చినా కలెక్షన్స్ రావట్లేదు. కాంబినేషన్స్ నమ్ముకుని పారితోషికాలు కూడా పెంచేస్తున్నారు. దీంతో సినిమాల బడ్జెట్ కూడా పెరిగిపోతుంది అని అన్నారు.

అలాగే ఓటీటీల గురించి మాట్లాడుతూ.. థియేటర్‌లో ఆడే సినిమా మాత్రమే లైఫ్ వుంటుంది. థియేటర్‌లో హిట్ అయితేనే ఓటీటీ వాళ్లు సినిమాలు తీసుకుంటున్నారు. ఓటీటీలో తీసుకుంటారు కదా అని కొంతమంది సినిమాలు చేసేస్తున్నారు. సినిమాల నిర్మాణం పెరిగింది కానీ క్వాలిటీ పెరగలేదు. ఓటీటీ దగ్గర సినిమాలు క్యూలో ఉంటున్నాయి. కనీసం ఓటీటీలో టెలికాస్ట్ చెయ్యమని అడుక్కునే పరిస్థితి ఉంది ఇప్పుడు. కంటెంట్ బాగుండే సినిమాలు నిర్మిస్తే ఇలాంటి పరిస్థితి రాదు అని అన్నారు.

Adipurush : ట్రిబెకా ఫెస్టివల్ లో ఆదిపురుష్ క్రేజ్ మాములుగా లేదుగా..

ఇక తన నిర్మాణంలో రాబోయే సినిమాల గురించి మాట్లాడుతూ.. కొత్తవాళ్లతో రోటి, కపడ, రొమాన్స్ అనే ఓ సినిమాతో పాటు నిర్మాత చంద్రశేఖర్ రెడ్డితో కలిసి సుడిగాలి సుధీర్‌ హీరోగా ఓ సినిమా చేస్తున్నాను. పాగల్ సినిమా దర్శకుడు నరేష్ ఈ సినిమాకు దర్శకుడు. వీటితో పాటు ఓటీటీ కోసం అవికాగోర్ ప్రధాన పాత్రలో స్వరూప్ దర్శకత్వంలో ఓ క్రేజీ థ్రిల్లర్ చేస్తున్నాను. విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో నాకు బాగా పరిచయం. ఏడు సంవత్సరాల క్రితం ఒక కథ విన్నాను. ఇప్పుడు ఆయన మంచి హిట్ కొట్టాడు కాబట్టి నాతో సినిమా ఉందా లేదా అని ఆయనే చెప్పాలి. అన్ని కుదరితే తప్పకుండా భవిష్యత్‌లో ఆయనతో సినిమాలు చేస్తాను అని తెలిపారు.