Bhanu shree: స్వాతంత్ర్యానికి ముందు కథతో.. బిగ్‌బాస్ భానుశ్రీ సినిమా!
తెలుగు బిగ్‌బాస్ సీజన్-2లో పార్టిసిపేట్ చేసి క్రేజ్ తెచ్చుకున్న నటి భానుశ్రీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘సర్వే నంబర్ 3’. ఈ సినిమాకు సంబంధించినచ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

Bhanu Sree
Bhanu shree: తెలుగు బిగ్‌బాస్ సీజన్-2లో పార్టిసిపేట్ చేసి క్రేజ్ తెచ్చుకున్న నటి భానుశ్రీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘సర్వే నంబర్ 3’. ఈ సినిమాకు సంబంధించినచ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. డి.రామకృష్ణ (ఆర్.కె.) దర్శకత్వంలో మేకా హేమసుందర్ నిర్మాతగా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. కొరియోగ్రాఫర్ అవ్వాలని సినిమా రంగంలోకి వచ్చిన భానుశ్రీ నటనలో రాణిస్తూ పలు సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తుంది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘ఇది నాకు రెండో సినిమా.. కరోనా సమయంలో సినిమా తీయాలని అనుకోలేదు. కానీ దర్శకుడు చెప్పిన కథ విని ఎంతో ఎగ్జయిట్ సినిమా తీస్తున్నాను. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు ఉన్న రాచరిక వ్యవస్థ, సంస్థానాల నేపథ్యంలో జరిగే కథ ఇది. ఈ సినిమాలో ఓ ప్రముఖ హీరో గెస్ట్‌గా నటించనున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అన్నారు.
View this post on Instagram
భానుశ్రీ బాహుబలితో పాటు పలు సినిమాల్లో నటించినప్పటికీ గుర్తు పట్టే స్థాయి వచ్చింది మాత్రం బిగ్ బాస్ ద్వారానే.. బిగ్‌బాస్ తర్వాత ఆమె సినిమా లీడ్ రోల్స్‌లో నటిస్తూ ఉన్నారు.
View this post on Instagram