RRR: సెట్​లో భీమ్-రామ్.. యాక్షన్ స్టార్..!

ప్రస్తుతానికి కరోనా తగ్గింది.. మళ్ళీ సినిమా సందడి మొదలైంది. ఇప్పటికే సగానికి పైగా పూర్తయి.. చివరి దశలో ఉన్న సినిమాలు మళ్ళీ షూటింగ్ మొదలయ్యాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన సినిమాలు ఎప్పుడు సరైన సమయం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే మన టాలీవుడ్ సినిమాలు కూడా తమ తమ కార్యకలాపాలను మొదలుపెట్టాయి.

RRR: సెట్​లో భీమ్-రామ్.. యాక్షన్ స్టార్..!

Rrr

RRR: ప్రస్తుతానికి కరోనా తగ్గింది.. మళ్ళీ సినిమా సందడి మొదలైంది. ఇప్పటికే సగానికి పైగా పూర్తయి.. చివరి దశలో ఉన్న సినిమాలు మళ్ళీ షూటింగ్ మొదలయ్యాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన సినిమాలు ఎప్పుడు సరైన సమయం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే మన టాలీవుడ్ సినిమాలు కూడా తమ తమ కార్యకలాపాలను మొదలుపెట్టాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది రాజమౌళి ఆర్ఆర్ఆర్ గురించే. భారత సినీ ఇండస్ట్రీలోనే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభమైంది.

ఇప్పటికే హీరోలు రామ్​చరణ్​, ఎన్టీఆర్​పై జక్కన్న కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తుండగా జులై చివరి నాటికి షూటింగ్​ ముగించాలని ప్రయత్నాలలో ఉన్నట్లుగా తెలుస్తుంది. దేశంలో నెలకొన్న థర్డ్ వేవ్ భయానికి తోడు ఇప్పటికే ప్రకటించిన విడుదల తేదీకి సినిమాను తీసుకురావాలంటే జులై నాటికి షూటింగ్ పూర్తిచేయాలని బలంగా అనుకుంటున్నారట. రెండు రోజుల క్రితమే రామ్​చరణ్ సెట్ లో​ అడుగుపెట్టగా.. గురువారం నుండి ఎన్టీఆర్​ కూడా జాయినైనట్లు చెప్తున్నారు. ప్రస్తుతం వీరిపై కీలక సన్నివేశాలు తీస్తున్నట్లు తెలుస్తుంది.

అక్టోబరు 13న ఈ సినిమా విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆ తేదీకి సినిమాను అందించాలని రాజమౌళి ప్రయత్నిస్తున్నాడట. అయితే.. షూటింగ్ తర్వాత సీజీ వర్క్ భారీ సమయం తీసుకొనే నేపథ్యంలో ఆ తేదీకి తీసుకురాగలరా అన్నదానిపై అనుమానాలున్నాయి. అయితే.. ఫుల్ స్పీడ్ లో ఉన్న ఆర్ఆర్ఆర్ టీం మాత్రం రాజమౌళి సెట్ చేసిన టార్గెట్ చేరుకోవాలని తపనపడుతున్నట్లుగా కనిపిస్తుంది.