Bheemla Nayak: హిందీలో రిలీజ్ కాని భీమ్లా నాయక్.. కారణం ఇదే!

బాహుబలి తర్వాత తెలుగు సినిమాలకు హిందీలో కూడా మంచి మార్కెట్ వచ్చేసింది. ఈ క్రమంలోనే దక్షిణ భారత సినిమాలు పాన్-ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Bheemla Nayak: హిందీలో రిలీజ్ కాని భీమ్లా నాయక్.. కారణం ఇదే!

Bheemla Nayak

Bheemla Nayak: బాహుబలి తర్వాత తెలుగు సినిమాలకు హిందీలో కూడా మంచి మార్కెట్ వచ్చేసింది. ఈ క్రమంలోనే దక్షిణ భారత సినిమాలు పాన్-ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హై-ఎండ్ యాక్షన్ సన్నివేశాలు, ఆకట్టుకునే కథాంశాలు అక్కడి ప్రేక్షకులను అలరించాయి. అల్లుఅర్జున్ నటించిన పుష్ప: ది రైజ్ కూడా హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించాయి.

ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అదే బాటలో వెళ్లేందుకు రెడీ అయింది. ఈ చిత్రాన్ని హిందీలో కూడా ఒకేసారి విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. సినిమాలో రానా దగ్గుబాటి ఉండడంతో సినిమాను బాలీవుడ్‌లో కూడా మర్కెట్ చేసుకునేందుకు ప్లాన్ చేశారు. భీమ్లా నాయక్‌ని హిందీలో ప్రమోట్ చేయడానికి నిర్మాతలు రానా దగ్గుబాటిని కూడా లైన్‌లోకి తీసుకున్నారు. అయితే, హిందీ డబ్బింగ్ పనులు పూర్తి కాకపోవడంతో ఒక వారం తర్వాత సినిమాని హిందీలో రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.

ఇక భీమ్లా నాయక్ అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతుండగా.. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను జాన్ అబ్రహం ఇప్పటి కొనుగోలు చేశారు. ఇప్పుడు భీమ్లా నాయక్ హిందీలో విడుదలైతే, జాన్ సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉందని, భీమ్లా నాయక్ సినిమాను హిందీలో విడుదల చేయకుండా జాన్ ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ సినిమా హిందీ వెర్షన్‌లో జాన్ అబ్రహంతో పాటు అర్జున్ కపూర్ కూడా నటిస్తున్నారు.

ఈ సినిమా నైజాం ఏరియాలో 400లకు పైగా హాళ్లలో సందడి చేస్తుంది. ఇక సీడెడ్‌లో 300, ఆంధ్రాలో 650లకు పైగా థియేటరల్లో వేయనున్నారు. ఏపీ, తెలంగాణ మొత్తం కలిపి.. 1350 థియేటర్లలో కనిపిస్తోండగా.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 350కి పైగా థియేటర్లలో భీమ్లా నాయక్‌ సినిమా రిలీజ్‌ అవుతోంది. ఓవర్సీస్‌లో 700కు పైగా థియేటర్లలో విడుదలవుతోంది.

నైజాం – 400+ థియేటర్లు
సీడెడ్‌ – 300+ థియేటర్లు
ఆంధ్రా – 650+ థియేటర్లు
ఏపీ, తెలంగాణ – 1,350+ థియేటర్లు
కర్ణాటక, ఇతర రాష్ట్రాలు – 350+ థియేటర్లు
ఓవర్సీస్‌ – 700+ థియేటర్లు

ప్రీ- రిలీజ్‌‌లోనే భీమ్లా నాయక్‌ భారీ బిజినెస్ చేశారు. ఏకంగా 110 కోట్లకుపైగా భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగినట్లు తెలుస్తోంది.

నైజాం – రూ.35 కోట్లు
సీడెడ్‌ – రూ.16.5 కోట్లు
యూఏ – రూ.9 కోట్లు
ఈస్ట్ – రూ.6.40 కోట్లు
వెస్ట్ – రూ.5.40 కోట్లు
గుంటూరు – రూ.7.20 కోట్లు
కృష్ణా – రూ.6 కోట్లు
నెల్లూరు – రూ.3.25 కోట్లు
ఏపీ, తెలంగాణ మొత్తం – రూ.88.75 కోట్లు
కర్ణాటక, ఇతర రాష్ట్రాలు – రూ.9 కోట్లు
ఓవర్సీస్‌ – రూ.9 కోట్లు