Prithvi Shaw – Sapna Gill : ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షా పై దాడి చేసిన నటి అరెస్ట్..

ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షా.. ఫిబ్రవరి 15 రాత్రి విచిత్రమైన సంఘటన ఎదురుకున్నాడు. సెల్ఫీ ఇవ్వలేదని దాడికి గురయ్యాడు. తాజాగా ఆ దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Prithvi Shaw – Sapna Gill : ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షా పై దాడి చేసిన నటి అరెస్ట్..

Prithvi Shaw - Sapna Gill

Prithvi Shaw – Sapna Gill : ఒక స్టార్ ఇమేజ్ సంపాదించుకుంటే సొసైటీలో మంచి గుర్తింపుతో పాటు అనేక విమర్శలు, సమస్యలు కూడా ఎదురుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షా.. ఫిబ్రవరి 15 రాత్రి విచిత్రమైన సంఘటన ఎదురుకున్నాడు. ఫిబ్రవరి 15న స్నేహితుడితో కలిసి పృథ్వీ షా ముంబైలోని మ్యాన్సన్ క్లబ్ ఆఫ్ సహారా అనే స్టార్ హోటల్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగొస్తుండగా ఇద్దరు వ్యక్తులు పృథ్వీ షాను సెల్ఫీ అడిగారు. వారి కోరిక మేరకు షా సెల్ఫీ ఇచ్చాడు, కానీ వాళ్ళు ఇంకో సెల్ఫీ కావాలని అడగడంతో పృథ్వీ షా నిరాకరించాడు.

Prithvi Shaw: సెల్ఫీ ఇవ్వలేదని పృథ్వీ షా కారుపై దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

దీంతో ఆగ్రహం చెందిన వారిద్దరూ.. పృథ్వీ షా ప్రయాణిస్తున్న కారుని అడ్డుకొని బేస్ బాల్ బ్యాట్ తో కారు అద్దాలు ధ్వంసం చేశారు. అంతేకాదు రూ.50 వేలు డిమాండ్ చేశారు, లేదంటే తప్పుడు కేసు పెడతామని బెదిరించారు. కాగా ఆ దుండగుల్లో ఒకరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.20 లక్షల పైగా ఫాలోయర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో డాన్స్ వీడియోలు, ఫ్యాషన్ షూట్ లు చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాదు ఈమె భోజ్‌పురి స్టార్స్ రవి కిషన్, దినేష్ లాల్ యాదవ్ వంటి సూపర్ స్టార్స్‌తో కలిసి భోజ్‌పురి సినిమాలో కూడా నటించింది.

‘కాశీ అమర్‌నాథ్’, ‘నిర్హువా చలాల్ లండన్’ మరియు ఇటీవల 2021లో విడుదలైన ‘మేరా వతన్’ వంటి సినిమాల్లో కూడా నటించింది. ఇక నిన్న ఈ భామ చేసిన వీరంగం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. తాజాగా సప్నా గిల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. సప్నా గిల్ ధ్వంసం చేసిన కారు పృథ్వీ షా స్నేహితుడిది. దాడి సమయంలో షా స్నేహితుడు కూడా కారులోనే ఉన్నాడు. దీంతో ఆమె పై పోలీసులకు పిర్యాదు చేశాడు పృథ్వీ ఫ్రెండ్. కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు.. ఆమెను అరెస్ట్ చేసి రేమండ్ కి పంపించారు.