Bholaa Shankar: మెగాస్టార్ మూవీ కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందేనా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ భారీ అంచనాల మధ్య సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు తొలిరోజునే సాలిడ్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. పండగపూట రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వాల్తేరు వీరయ్య మేనియాతో ఊగిపోయాయి. దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో చిరంజీవి ఊరమాస్ అవతారంలో కనిపించి అదరగొట్టాడు.

Bholaa Shankar: మెగాస్టార్ మూవీ కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందేనా..?

Bholaa Shankar Release To Be Postponed

Bholaa Shankar: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ భారీ అంచనాల మధ్య సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు తొలిరోజునే సాలిడ్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. పండగపూట రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వాల్తేరు వీరయ్య మేనియాతో ఊగిపోయాయి. దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో చిరంజీవి ఊరమాస్ అవతారంలో కనిపించి అదరగొట్టాడు.

Bholaa Shankar: పండగపూట మెగాస్టార్ మరో ట్రీట్.. భోళాశంకర్ వచ్చేది అందులోనే!

ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో ఈ మూవీ ఇప్పటికే వంద కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. దీంతో చిరు అండ్ టీమ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వాల్తేరు వీరయ్య ఇచ్చిన బూస్ట్‌తో మెగాస్టార్ తన నెక్ట్స్ మూవీ షూటింగ్‌ని స్టార్ట్ చేశారు. ఇప్పటికే దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్‌లో ‘భోళాశంకర్’ అనే సినిమాను స్టార్ట్ చేశాడు చిరు. కాగా, ఈ సినిమా షూటింగ్‌లో మెగాస్టార్ తాజాగా జాయిన్ కూడా అయ్యారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది.

Bholaa Shankar : చిరు సినిమాలో రష్మి స్పెషల్ సాంగ్..

భోళాశంకర్ సినిమాను తొలుత ఏప్రిల్ నెలలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ సగం కూడా పూర్తకపోవడంతో, ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేరని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్‌ను జరిపితేనే, వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయగలరని చిత్ర వర్గాలు అంటున్నాయి. దీంతో ఈ సినిమాను ఏప్రిల్‌లో కాకుండా మే నెలలో రిలీజ్ చేస్తారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మరి నిజంగానే ఈ సినిమాను ఏప్రిల్‌లో కాకుండా మేలో రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో చిరు చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా, తమన్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.