Bigg Boss 5 Telugu: మహిళలను గెలిపించిన నాగ్

బిగ్ బాస్ సీజన్ రెండు వారాల్లో ఇద్ద‌రు ఇంటి స‌భ్యులు ఎలిమినేట్ కావ‌డంతో 17మంది మాత్ర‌మే మిగిలారు. చివ‌రికి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పేరు రివీల్ చేసిన నాగ్..

10TV Telugu News

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ రెండు వారాల్లో ఇద్ద‌రు ఇంటి స‌భ్యులు ఎలిమినేట్ కావ‌డంతో 17మంది మాత్ర‌మే మిగిలారు. చివ‌రికి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పేరు రివీల్ చేసిన నాగ్.. అంతకుముందు గేమ్ ఆడిస్తూనే ఒక్కొక్క‌రిని సేవ్ చేసుకుంటూ వ‌చ్చారు. గార్డెన్ ఏరియాలో డెస్టినీ గేమ్ అంటూ ఏర్పాటు చేసి అబ్బాయిల‌ని, అమ్మాయిల‌ని జ‌ట్లుగా విడ‌దీశాడు.

డెస్టినీ పేర్లతో డ్యాన్స్‌లు చేయించాడు. ష‌ణ్ముఖ్‌- ఉమాదేవి క‌లిసి డ్యాన్స్ చేశారు. కంటెస్టెంట్లు అంతా వీరి పర్ఫామెన్స్‌ను తెగ ఎంజాయ్ చేశారు. నాగ్ కూడా ఇంప్రెస్ కాగా, షన్నుకు ఏడు, ఉమా ఎక్స్‌ప్రెషన్స్‌కి 8 మార్కులు ఇచ్చేశాడు. ఆ త‌ర్వాత ల‌హ‌రి- జ‌శ్వంత్ డ్యాన్స్ చేశారు. ఈ ఇద్దరూ స్వింగ్ జరా పాటకు డ్యాన్స్ వేశారు. జెస్సీ అద‌ర‌గొట్టేశాడు.

కాజల్‌కు జోడిగా లోబో భీమవరం బుల్లోడా అనే పాటకు డ్యాన్సు వేశారు. శ్వేత‌కు జోడిగా సన్నీ.. అమ్మడు కుమ్ముడు అనే పాటకు స్టెప్పులు వేశారు. ప్రియకు జోడిగా రవి వచ్చి లక్ష్మీ బావా అనే పాటకు అదిరిపోయేలా స్టెప్పులు వేశారు. హమీదాకు శ్రీరామచంద్ర జోడిగా లంచుకొస్తావా? అనే పాటకు డ్యాన్సులు వేశారు. ప్రియాంకకు మానస్ జోడిగా నచ్చావే నైజాంపోరి అంటూ రెచ్చిపోయారు. ఆనీ మాస్టర్‌కు విశ్వ జోడిగా వచ్చాడు. ఈ ఇద్దరూ కలిసి జ్వాలా రెడ్డి పాటకు దుమ్ములేపేశారు.

Read Also: రేవంత్‌కు మరో సవాల్ విసిరిన కేటీఆర్.. నువ్వు టెస్టుకు సిద్ధమేనా..

న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌-సిరి క‌లిసి డ్యాన్స్ చేశారు. గరంగరం సిలక అంటూ నటరాజ్ మాస్టర్ తన టాలెంట్‌ను అంతా చూపించేశాడు. నటరాజ్ మాస్టర్‌కు పది ఇవ్వాలి కానీ కొరియోగ్రఫర్ కాబట్టి 9 ఇస్తాను. సిరికి 8 అంటూ నాగ్ చెప్పేశాడు. మొత్తానికి అమ్మాయిల‌నే విజేత‌లు చేశారు నాగ్.