Bigg Boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 విన్నర్ ‘రేవంత్’.. అఫీషియల్ సైట్‌లో అనౌన్స్..
బిగ్‌బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేకి వచ్చేసింది. లాస్ట్ వీక్‌లో ఆరుగురు హౌస్‌మేట్స్‌గా రోహిత్, శ్రీసత్య, శ్రీహాన్, కీర్తి, ఆదిరెడ్డి, రేవంత్ ఉండగా.. మిడ్ వీక్ ఎలిమినేషన్ తో శ్రీసత్య హౌస్ నుంచి బయటకి వచ్చేసింది. కాగా మొదటినుంచి ఈ సీజన్ కప్ నేనే అందుకునేది అంటూ చెబుతూ వస్తున్న...

Bigg Boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేకి వచ్చేసింది. సెప్టెంబర్ 4న మొదలైన ఈ సీజన్ నేటితో ముగింపు పలకనుంది. మొత్తం 21 కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ సీజన్ 6.. ఫైనల్‌కి ఐదుగురితో చేరింది. లాస్ట్ వీక్‌లో ఆరుగురు హౌస్‌మేట్స్‌గా రోహిత్, శ్రీసత్య, శ్రీహాన్, కీర్తి, ఆదిరెడ్డి, రేవంత్ ఉండగా.. మిడ్ వీక్ ఎలిమినేషన్ కారణంగా, ఫైనల్ కి వెళుతుంది అనుకున్న శ్రీసత్య అనూహ్యంగా హౌస్ నుంచి బయటకి వచ్చేసింది.
Bigg Boss 6 : బిగ్‌బాస్ ఫైనల్లో ‘ధమాకా’ సందడి..
ఇక ఫినాలే రోజు వచ్చేయడంతో.. హౌస్ లోకి మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు. అలాగే ఫైనల్ కి వచ్చిన ఐదుగురి ఆట తీరు గురించి వాళ్ళకి తెలియజేశారు. కాగా మొదటినుంచి ఈ సీజన్ కప్ నేనే అందుకునేది అంటూ చెబుతూ వస్తున్న ‘రేవంత్’ ఈ సీజన్ విన్నర్‌గా నిలిచాడు. ఈ విషయాన్ని బిగ్‌బాస్ అఫీషియల్ సైట్‌లో ఎంట్రీ చేశారు షో నిర్వాహుకులు. తాను ట్రోఫీ గెలుస్తాను అనే నమ్మకంతో ‘టికెట్ టు ఫినాలే’ని కూడా వదులుకున్నాడు రేవంత్. చివరకి తన అనుకున్నట్లే బిగ్‌బాస్ సీజన్ విజేతగా నిలిచాడు.
అలాగే మొదటి రన్నర్ అప్‌గా శ్రీహాన్ నిలవగా.. సెకండ్ రన్నర్ అప్‌గా కీర్తి నిలిచింది. దీంతో విన్నర్ గా నిలిచిన రేవంత్ కి రూ.50 లక్షల ప్రైజ్ మనీతో పాటు రూ.25 లక్షల విలువ చేసే ప్లాట్ మరియు కారుని ఇవ్వనున్నారు. రన్నర్ అప్ శ్రీహాన్ కి 5 లక్షల రివార్డ్ అందుకోనున్నాడు. కాగా ఈ గ్రాండ్ ఫైనల్ లో విజేతలను ప్రకటించేందుకు ‘ధమాకా’ టీమ్ ఎంట్రీ ఇచ్చింది. హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీలా ఈ ఫినాలేలో సందడి చేశారు. అలాగే వీరితో పాటు టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ‘నిఖిల్’ కూడా ఎంట్రీ ఇచ్చాడు.