Bigg Boss 6 : బిగ్‌బాస్ ఫైనల్లో ‘ధమాకా’ సందడి..
బిగ్‌బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేకి వచ్చేసింది. సెప్టెంబర్ 4న మొదలైన ఈ సీజన్ నేటితో ముగింపు పలకనుంది. మొత్తం 21 కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ సీజన్ 6.. ఫైనల్‌కి ఐదుగురితో చేరింది. కాగా ఈ గ్రాండ్ ఫైనల్ లో విజేతలను ప్రకటించేందుకు 'ధమాకా' టీమ్ ఎంట్రీ ఇచ్చింది.

Bigg Boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేకి వచ్చేసింది. సెప్టెంబర్ 4న మొదలైన ఈ సీజన్ నేటితో ముగింపు పలకనుంది. మొత్తం 21 కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ సీజన్ 6.. ఫైనల్‌కి ఐదుగురితో చేరింది. లాస్ట్ వీక్‌లో ఆరుగురు హౌస్‌మేట్స్‌గా రోహిత్, శ్రీసత్య, శ్రీహాన్, కీర్తి, ఆదిరెడ్డి, రేవంత్ ఉండగా.. మిడ్ వీక్ ఎలిమినేషన్ కారణంగా, ఫైనల్ కి వెళుతుంది అనుకున్న శ్రీసత్య అనూహ్యంగా హౌస్ నుంచి బయటకి వచ్చేసింది.
Bigg Boss 6 Day 104 : మిడ్ వీక్‌లో బిగ్‌బాస్ ఎలిమినేషన్.. శ్రీ సత్య అవుట్!
ఇక ఫినాలే రోజు వచ్చేయడంతో.. హౌస్ లోకి మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు. అలాగే ఫైనల్ కి వచ్చిన ఐదుగురి ఆట తీరు గురించి వాళ్ళకి తెలియజేశారు. కాగా ఈ గ్రాండ్ ఫైనల్ లో విజేతలను ప్రకటించేందుకు ‘ధమాకా’ టీమ్ ఎంట్రీ ఇచ్చింది. హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీలా ఈ ఫినాలేలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేయకపోయినా, కొన్ని ఫోటోలు లీక్ అయిని.
అలాగే వీరితో పాటు టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ‘నిఖిల్’ కూడా ఎంట్రీ ఇచ్చాడు. కాగా ఈ సీజన్ బిగ్‌బాస్ అట్టర్ ప్లాప్ గా నిలిచింది. ఈ షో రేటింగ్స్ భారీగా పడిపోయాయి. దీంతో నాగార్జున కూడా బిగ్‌బాస్ ఫ్రాంచైజ్ నుంచి తప్పుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికి నాగార్జున నాలుగు సీజన్లకి హోస్ట్ గా వ్యవహరించాడు. నాగార్జున నిర్ణయంతో షో నిర్వాహుకులు తరువాతి సీజన్ కి విజయ దేవరకొండని హోస్ట్ గా తీసుకొనే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది.